OG మూవీలో పవన్ పేరు లీక్: చేసేది డాన్‌గా.. పేరు మాత్రం శాంతి ప్రదాతదా!
కొంత కాలంగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో కూడా ఉండనంత బిజీగా గడుపుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. ఇప్పుడు ఒకేసారి నాలుగు ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నాడు.
అందులో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. ఒకే ఒక్క చిత్రంతో దేశం మొత్త తనవైపు తిరిగి చూసేలా చేసుకున్న దర్శకుడు సుజిత్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ క్రేజీ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ముంబై నగరంలో కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు.
ఈ మూవీని క్రిస్మస్ కానుకగా మూడు రోజుల ముందుగానే అంటే డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ షూటింగ్‌ను ప్లాన్ చేసుకుంటున్నారట. దీన్ని ఎలాగైనా అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేశారు.
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచే 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీని నుంచి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం..
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ 'గాంధీ' అనే పేరు ఉన్న పాత్రను చేస్తున్నాడు. శాంతి ప్రదాత పేరు పెట్టుకున్న అతి సామాన్యుడు పవర్‌ఫుల్ డాన్‌గా ఎలా మారాడు అన్న అంశంతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలిసింది. అయితే, ఈ చిత్రంలో పవన్ 'గాంధీ' పేరును తక్కువగానే వాడతారని సమాచారం.
'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











