Bheemla Nayak: ఫ్యాన్స్‌ను కలవబోతున్న పవన్ కల్యాణ్.. డేట్, ప్లేస్ పూర్తి వివరాలు ఇవే

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే చిత్రాల్లో కొంత కాలంగా వైవిధ్యం కనిపిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో సరికొత్త కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. అందులో మల్టీస్టారర్ మూవీలు కూడా ఉన్నాయి. వీటికి రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో దక్కుతుండడంతో దర్శక నిర్మాతలు, హీరోలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ మూవీనే 'భీమ్లా నాయక్'. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా గురించి పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఏంటా వార్త? పూర్తి వివరాలు మీకోసం!

భారీ మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్

భారీ మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కలయికలో రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీనే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.

 దానికి రీమేక్... హీరోల పాత్రలిలా

దానికి రీమేక్... హీరోల పాత్రలిలా

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం'కు భీమ్లా నాయక్ మూవీ రీమేక్‌గా తెరకెక్కింది. ఇది ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో రూపొందింది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా నటించారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది.

అంచనాలు తగ్గట్టే భారీ బిజినెస్

అంచనాలు తగ్గట్టే భారీ బిజినెస్

భారీ మల్టీస్టారర్‌గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ ఆ మధ్య వచ్చింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇవి అభిమానులతో పాటు సినీ ప్రియుల ఆదరణను అందుకున్నాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా భారీగా అయింది.

ఆ రెండు డేట్లు.. అయోమయంగా

ఆ రెండు డేట్లు.. అయోమయంగా


క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని ఇటీవలే చిత్ర యూనిట్ వెల్లడించడంతో అందరిలో అయోమయం నెలకొంది.

సర్‌ప్రైజ్ చేసిన భీమ్లా యూనిట్

సర్‌ప్రైజ్ చేసిన భీమ్లా యూనిట్

ఎంతో ప్రత్యేకంగా రూపొందిన ‘భీమ్లా నాయక్' మూవీ విడుదల ఆంధ్రప్రదేశ్‌లో విధించిన నైట్ కర్ఫ్యూ, యాభై శాతం ఆక్యూపెన్సీ మీద ఆధారపడి ఉంటుందని నిర్మాత ప్రకటించాడు. దీనికితోడు ‘గని', ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాలు ఫిబ్రవరి 25న రాబోతున్నాయి. దీంతో ఇది ఇప్పట్లో విడుదల కాదన్న టాక్ వినిపించింది. కానీ, దీన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తున్నారు.

 ఫ్యాన్స్‌ను కలవబోతున్న పవన్

ఫ్యాన్స్‌ను కలవబోతున్న పవన్

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రూపొందిన ‘భీమ్లా నాయక్' మూవీని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Recommended Video

RRR, Bheemla Nayak Release Dates బాక్సాఫీస్ వార్ | Radhe Shyam | KGF 2 | Filmibeat Telugu
 డేట్, ప్లేస్ పూర్తి వివరాలు ఇవే

డేట్, ప్లేస్ పూర్తి వివరాలు ఇవే

‘భీమ్లా నాయక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గురించి తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ వేడుకను ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించబోతున్నారట. దీన్ని హైదరాబాద్‌ నగరంలోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఎంతో గ్రాండ్‌గా చేయబోతున్నారట. విశాలవంతమైన ప్రదేశం కావడంతో దీనికి కొన్ని వేల మంది వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X