Bheemla Naayak రిలీజ్ డేట్ ఫిక్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నుంచి జాతరే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లో సినిమాల జాతరకు తెర లేపారు. ఇప్పటి వరకు స్తబ్దతలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకు ఒక్కసారిగా జోష్ వచ్చింది. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్ డేట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ అధికారికంగా ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా ఈ సినిమా పోస్టర్ ట్రెండింగ్‌గా మారింది. అభిమానుల్లో జోష్ ఊపందుకొన్నది. భీమ్లా నాయక్ రిలీజ్ వివరాల్లోకి వెళితే..

మలయాళంలో విజయవంతమైన

మలయాళంలో విజయవంతమైన

భీమ్లా నాయక్ చిత్రం మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోషియం సినిమా ఆధారంగా తెరకెక్కింది. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తోపాటు రానా దగ్గుబాటి, నిత్య మీనన్, బ్రహ్మాజీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అప్పట్లో ఒకడుండే వాడు దర్శకుడు సాగర్ కే చంద్ర డైరెక్టర్‌గా వ్యవహరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందించాడు.

భీమ్లా నాయక్ పలు మార్లు వాయిదా

భీమ్లా నాయక్ పలు మార్లు వాయిదా


పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్ర రిలీజ్ పలుమార్లు కొన్ని అనవసరమైన కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. మూడో వేవ్ కరోనావైరస్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం గురించి ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకుల ఎదురు చూస్తున్నారు. అయితే ఫిబ్రవరి 25 తేదీ లేదా ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేస్తామని యువ నిర్మాత నాగవంశీ ప్రకటన చేశారు.

రిలీజ్ డేట్ విషయంలో ఊగిసలాట

రిలీజ్ డేట్ విషయంలో ఊగిసలాట


అయితే ఏపీలో నెలకొన్న స్తబ్దత, వివాదాల కారణంగా భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్‌ డేట్ విషయంలో ఊగిసలాట కొనసాగింది. అయితే అభిమానుల్లో ఉత్తేజం పెంచుతూ సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి సమయంలో భీమ్లా నాయక్ రిలజ్ డేట్ అఫిషియల్‌గా ప్రకటించారు. పవన్ కల్యాణ్ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

స్పెషల్ సాంగ్‌తో షూటింగ్ పూర్తి

స్పెషల్ సాంగ్‌తో షూటింగ్ పూర్తి

ఇక భీమ్లా నాయక్ సినిమా వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ పాట చిత్రీకరణను ఫిబ్రవరి 14వ తేదీన రామోజీ ఫిలిం సిటీలో పూర్తి చేశారు. దాంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు సిద్దమైంది. దాంతో స్పెషల్ పాటలో పవన్ కల్యాణ్‌తో ప్రధాన తారాగణం మొత్తం నటించింది. ఈ పాటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X