twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రణబ్ ముఖర్జీ మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి.. ఆ విలక్షణత నాకు స్ఫూర్తి అంటూ..

    |

    భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మరణ వార్తతో సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాయి. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు పంచుకొంటున్నారు. అలాగే ప్రణబ్ లాంటి దిగ్గజ రాజకీయ కోవిదుడి సేవలను స్మరించుకొంటున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణ వార్త వినగానే సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తన సంతాపాన్ని, బాధను వ్యక్తం చేశారు.

    ప్రణబ్ ముఖర్జీ గారు దివంగతులయ్యారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత రాజకీయాల్లో తనదంటూ సొంత ముద్రను శ్రీ ప్రణబ్ ముఖర్జీ వేసుకొన్నారు. అలాంటి దిగ్గజ నేత మరణం దేశానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి కుటుంబానికి నా తరఫున, జనసేన తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

     Pawan Kalyans condolences to Former President Pranab Mukherjee

    స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో పుట్టి.. రాజకీయాల్లో ప్రవేశించిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో ఆయనొక విలక్షణమైన ధ్రువతారగా వెలిగారు. ఈ దేశం కూడా పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో ఆయన సేవలను సముచితంగా సత్కరించుకుంది. దేశ రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలు మరచిపోకుండా.. తన పండిట్ల కుటుంబపరంగా వస్తున్న దేవతార్చన సంప్రదాయం అనుసరించి ప్రత్యేక పర్వ దినాలలో ఆ సంప్రదాయాన్ని అనుసరించడం విశేషం. ఆ విలక్షణత నన్నెంతో ఆకట్టుకొంది. ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం.. భవిష్యత్ తరాలకి ఆదర్శనీయం, అనుసరణీయమైనవి అని పవన్ కల్యాణ్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.

    English summary
    Power star, Jana Sena chief Pawan Kalayn condolences to Former President Pranab Mukherjee. He says, Pranab is inspiration to many leaders. He has served great democratic nation and rendered huge services to India in terms of economically.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X