For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దటీజ్ పవన్ : మొగిలయ్యకు అండగా జనసేన.. ఇంటి కోసం రంగంలోకి, కీలక ప్రకటన!

  |

  ఎప్పుడు ఎవరికి క్రేజ్ వస్తుందో? ఎవరం చెప్పలేం, బుల్లెట్ బండి సాంగ్ కి డ్యాన్స్ వేసిన అమ్మాయి ఫేమస్ కావుగా ఇప్పుడు తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారులు దర్శనం మొగులయ్య పేరు కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. పవన్‌ కల్యాణ్‌, దగ్గుబాటి రానా కలయికలో రూపొందుతున్న చిత్రం 'బీమ్లా నాయక్‌'లో టైటిల్‌ సాంగ్‌ ఇంట్రడక్షన్ పాడే అవకాశం వచ్చింది. ఈ దెబ్బతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయన కష్టాలు తీరిపోయినట్లే చెప్పాలి. పాట పాడినందుకు పవన్ రెండు లక్షల రెమ్యునరేషన్ ఇవ్వగా ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు జనసేన ముందుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

   భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్

  భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్

  పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను యూట్యూబ్‌లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ పాటలో పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ భీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ తనదైన యాసలో గొంతు కలుపుతూ ఓ వ్యక్తి కనిపిస్తాడు, ఆయనే అంతరించిపోతున్నఈ కిన్నెర కళకు ఊపిరిలూదుతున్న కళాకారుడు మొగులయ్య. ఆయన స్వగ్రామం నల్లమల్లకు ఆలవాలం అయిన నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట.

   పన్నెండు మెట్లుగా మార్చి మరీ

  పన్నెండు మెట్లుగా మార్చి మరీ

  తన తండ్రి ఎల్లయ్య నుంచి వారసత్వంగా వచ్చిన ఏడు మెట్ల కిన్నెరను పన్నెండు మెట్లుగా మార్చి మరీ పేరు తెచ్చుకున్నారు మొగిలయ్య. గతంలోనే అంతరించిపోతున్న కిన్నెర వాద్య కళను కాపాడుతున్న మొగిలయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించడమే కాక జీవిత చరిత్రను సైతం ఎనిమిదో తరగతిలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది.

  2 లక్షల రూపాయల రెమ్యునరేషన్

  2 లక్షల రూపాయల రెమ్యునరేషన్

  అయితే మొగిలయ్యకు పాట పాడినందుకు పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తన చేతులతో స్వయానా అందించారు. పవన్ మొగిలయ్యను వ్యక్తిగతంగా కలుసుకుని, ఆయనకు రూ.2 లక్షల చెక్కును సైతం అందచేశారు. కిన్నెర మొగులయ్య వంటి సాంప్రదాయ జానపద కళాకారులకు చాలా కాలం నాటి కళారూపాలను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన మద్దతు అందించడం చాలా అవసరం అని కూడా పవన్ పేర్కొన్నారు.

  తమిళిసై ప్రశంసలు

  తమిళిసై ప్రశంసలు

  అయితే పవన్ ఆయనకు చేసిన సాయం గురించి తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రశంసలు కురిపించారు. "సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారులు మొగులయ్య గారికి 2 లక్షల ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. మీ సహాయం స్పూర్తిదాయకం" అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రశంశలు కురిపించారు. అయితే ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు జనసేన ముందుకు వచ్చింది. నిజానికి ఆయన ఇంటికి సాయం చేస్తామని తెలంగాణ మంత్రులు ముందుకు వచ్చి ప్రకటన చేశారు, కానీ అది ఎప్పుడు ఏమిటి అనే క్లారిటీ ఇవ్వలేదు.

   పవన్ ప్రశంసల వర్షం

  పవన్ ప్రశంసల వర్షం

  అయితే తాజాగా అశోక్ రాథోడ్ అనే వ్యక్తి తన సొంత స్థలాన్ని మొగిలయ్యకు బహుమతిగా ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇక ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి జనసేన ముందుకు వచ్చింది. జనసేన తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగా లక్ష్మణ్ గౌడ్ ముందుకు రాగా ఆయన మీద పవన్ ప్రశంసల వర్షం కురిపించారు.

  Recommended Video

  Bigg Boss Telugu 5 కు నాగార్జున రెమ్యూనరేషన్ అన్ని కోట్లా ? || Filmibeat Telugu
   గౌరవించడం సంతోషకరం.

  గౌరవించడం సంతోషకరం.

  ''మొగులయ్యకు సాయంగా నిలిచిన జనసేన యువజన నాయకులు లక్ష్మణ్ గౌడ్ అభినందనీయుడు, కిన్నెర కళాకారుడు శ్రీ దర్శనం మొగులయ్యకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన జనసేన తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శ్రీ వంగా లక్ష్మణ్ గౌడ్ అభినందనీయులు. ఆ కిన్నెర కళాకారుడు ఇల్లు నిర్మించుకునే సమయంలో తగిన సాయం చేసేందుకు శ్రీ లక్ష్మణ్ గౌడ్ సంసిద్ధులయ్యారు. ఈ మేరకు ఆయన శ్రీ మొగులయ్యను కలిసి భరోసా ఇచ్చారు. తెలంగాణ భాగమైన జానపద కళను, ఆ కళాకారుణ్ణి సముచితంగా గౌరవించడం సంతోషకరం.'' అంటూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  English summary
  Pawan kalyan's janasena to build a house to Kinnera Mogulaiah of pannendu metla kinnera fame. he sung title song of bheemla nayak
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X