లుక్కు మార్చిన పవన్.. రిలాక్స్ అవుతున్నారా? లేక! జనాల్లో అనుమానాలు

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించిన చర్చలే జోరుగా సాగుతున్నాయి. పవన్ ఎంత క్లారిటీ ఇద్దామని ప్రయత్నించినా ఏదో ఒక రకంగా ఆయనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు జనం. రాష్ట్రానికి పట్టిన దుమ్ముదులిపేస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ అట్టర్ ప్లాప్ కావడంతో ఇక ఆయన దారెటు? అనే దానిపై చర్చించుకుంటున్నారు పబ్లిక్. తాను తిరిగి సినిమాల్లోకి రానని ఇప్పటికే పలుమార్లు చెప్పినా జనాల్లో మాత్రం అనుమానాలు పోవడం లేదు. దీనికి ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవే కారణం అని చెప్పుకోవచ్చు. అదెలాగో.. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందో మీకూ తెలుసు.

జనసేన పార్టీ కోసమై రేయింబవళ్లు కష్టపడి తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్. ఆ టైమ్ లో రాజకీయ నాయకుడిగా తెల్లటి లాల్చీ పైజమాలో పవన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కాగా ఇన్నాళ్లు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన పవన్.. ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి సివిల్ డ్రెస్ లో కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. ఇందులో ఆయన నీలి రంగు టీ షర్ట్‌, జీన్స్‌ ధరించి గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ రాజకీయ జీవితంపై ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటున్నారు తెలుగు ప్రజలు. మొత్తానికి ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయినా కూడా ప్రజా నోళ్ళలో మాత్రం క్షణక్షణం నానుతున్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyans new look get raising doubts in people

ఇటీవలే వచ్చిన 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దీంతో జనసేన వర్గాల్లో తీవ్ర నిరాశ మిగిలింది పోటీచేసిన రెండు చోట్లా పవన్‌ ఓడిపోవడం జీర్ణించుకోలేక పోతున్నారు మెగా అభిమానులు. భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో పవన్‌ సుమారు 2 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు పవన్. అదేవిధంగా గాజువాకలోనూ వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో పవన్‌ డీలా పడ్డారు. ఎలాగోలా ఒక్క సీటు మాత్రం జనసేన దక్కించుకోగలిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X