పవన్ కళ్యాణ్ పెద్ద మనసు... అనాథల దుస్థితిపై భావోద్వేగం, పిల్లలకు ఊహించని సాయం

పవన్ కళ్యాణ్... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మూడు దశాబ్ధాలుగా తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేస్తున్న పేరు. కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవంగా, చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా కొనసాగుతున్నారు పవన్. ఒక నటుడిగా కంటే ఆయన వ్యక్తిత్వాన్నే ప్రజలు ఇష్టపడతారు. ఎదుటి మనిషి ఆపదలో ఉంటే ఎలాంటి సాయానికైనా వెనుకాడరు పవన్ కళ్యాణ్. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి నేడు ఉప ముఖ్యమంత్రిగా ఎదిగినా ఆయనలో కొంచెం కూడా మార్పు రాలేదంటే అతిశయోక్తి లేదు. తాజాగా మరోసారి జనసేనాని పెద్ద మనసును చాటుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

మానవత్వమే ముఖ్యం
సాటి మనిషి ఆపదలో ఉంటే సాయం చేసే వరకు నిద్రపోరు పవన్ కళ్యాణ్. అప్పట్లో కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే తన కోట్లాది మంది అభిమానుల ద్వారా బ్లడ్ డొనేషన్, ఇతర సాయాలను ప్రజలకు అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు హుటాహుటిన స్పందించి తన వంతుగా సాయం అందించడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. వివిధ అవసరాల నిమిత్తం తనను కలిసే వారిని ఖచ్చితంగా ఆదుకుని పంపుతారు.

Pawan Kalyan s Steps In as Guardian for Orphaned Children in Pithapuram

పదేళ్ల పోరాటానికి ప్రతిఫలం
అగ్రనటుడిగా వెలుగొందుతూ.. వందల కోట్ల రెమ్యునరేషన్ వదులుకుని తనను ఇంతటివాడిని చేసిన ప్రజలకు సేవ చేయాలని జనసేన పార్టీతో రాజకీయాల్లోకి దిగారు పవన్ కళ్యాణ్. పదేళ్ల పాటు ఎన్నో కష్టాలను, అవమానాలను, వ్యయ ప్రయాసలను ఓర్చుకుని జనసేన పార్టీని అధికారంలో భాగస్వామిని చేశారు. వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు డిప్యూటీ సీఎం. ముఖ్యంగా తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని కట్టబెట్టిన పిఠాపురం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్నారు జనసేనాని.

పిఠాపురంలో అభివృద్ధి పరుగులు
పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు తీయించడంతో పాటు రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గాల్లో ఒకటిగా మార్చేలా కృషి చేస్తున్నారు డిప్యూటీ సీఎం. ఇక పిఠాపురంలో సంక్షేమ కార్యక్రమాలను వ్యక్తిగతంగా తీసుకుని అండగా నిలుస్తున్నారు. వారికి చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా తక్షణం పరిష్కరించేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోకవర్గానికి చెందిన 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్ధిక సాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్. తాజాగా మరో ఇద్దరు అనాథలకు తల్లీతండ్రిగా మారారు డిప్యూటీ సీఎం.

చిన్నారుల దుస్ధితికి కదిలిపోయిన పవన్ కళ్యాణ్
పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయి అనాథలుగా మారారు. కనీసం తలదాచుకోవడానికి ఇల్లు కూడా లేక ఇబ్బందిపడుతున్న పిల్లలు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తమ దుస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఆ చిన్నారుల వేదన పవన్ కళ్యాణ్‌ను కదిలించింది. వెంటనే ఆ చిన్నారులకు ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున... ఇద్దరికీ రూ. 10 వేలు అందించాలని తన కార్యాలయ అధికారులని ఆదేశించారు. అలాగే ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇద్దరు చిన్నారులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో చేర్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. చిన్నారుల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ పెద్ద మనిషిగా మారారని కొనియాడుతున్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan janasena pithapuram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X