పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్.. ఉస్తాద్ డైలాగ్స్‌పై హరీష్ శంకర్ క్లారిటీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా, దర్శకుడుహరీష్ శంకర్ (Harish Shankar) తెరకెక్కిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ (Aura of Ustaad) సాంగ్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో మూవీ హైప్ మరింత పెరిగింది. ఇదే సమయంలో సినిమాలో రాజకీయ డైలాగులు ఉంటాయా? ఎవరినైనా టార్గెట్ చేసే సీన్స్ ఉంటాయా? అన్న సందేహాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తన తనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారని డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్ కావడంతో, మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తుండగా, కీలక పాత్రల్లో పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్‌బీ శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కేజీఎఫ్ అవినాష్ వంటి ప్రముఖులు కనిపించనున్నారు.

Pawan Kalyan s Sweet Warning Harish Shankar Confirms Ustaad Bhagat Singh Is Pure Mass Entertainment

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. స్క్రీన్‌ప్లేను కె. దశరథ్, రమేష్ రెడ్డి సమకూర్చగా, రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్ పని చేశారు. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలకు వస్తున్న స్పందనతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్స్ పొలిటికల్ గా, సైటర్ గా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ 'ఈ సినిమా మొదలైన తొలి రోజే పవన్ గారు ఒక విషయం చాలా క్లియర్‌గా చెప్పారు. సినిమా వేరు.. రాజకీయాలు వేరు. ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. అదే మా ప్రైమరీ గోల్'అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎలాంటి రాజకీయ సెటైర్లు, వ్యక్తిగత విమర్శలు లేదా ఎవరినైనా కించపరిచే డైలాగులు ఉండవని డైరెక్టర్ హరీష్ శంకర్ స్పష్టం చేశారు. 'హీరో ఎలివేషన్ కోసం పవన్ స్టైల్ డైలాగ్స్ ఉంటాయి.. కానీ అవి ఎవ్వరిని టార్గెట్ చేసేలా ఉండవు. పూర్తిగా మాస్, ఫన్, ఎమోషన్ మిక్స్ చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నాం' అని హరీష్ చెప్పారు.

ఇక పవన్ గురించి మాట్లాడుతూ 'వ్యక్తిగతంగా ఆయన ఎవరిపైనా దాడి చేయరు. ఆయన పోరాటం ఎప్పుడూ విధానాలపైనే. అందుకే ఈ సినిమాలో కూడా అదే ఫాలో అవుతున్నాం' అని వివరించారు. అలాగే.. గాజు గ్లాస్ డైలాగ్ ను కూడా కేవలం హీరో ఎలివేషన్ కోసం పెట్టామని తెలిపారు. రాజకీయ రిఫరెన్స్‌లు అవసరం లేదని, పవన్‌ని ఫుల్ మాస్ అవతార్‌లో చూడాలనుకుంటున్నామని చెబుతున్నారు.

ఇటీవల విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటపై వస్తున్న స్పందన తనకు చాలా ఆనందం ఇచ్చిందని హరీష్ తెలిపారు. పవన్ ఎనర్జీ, లిరిక్స్, బీట్ అన్నీ కలిసి అభిమానులను ఊపేస్తున్నాయన్నారు. చాలామంది ఫ్యాన్స్ తమదైన స్టైల్లో వీడియో ఎడిట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో యూనిట్ మొత్తం ఖుషీగా ఉందని చెప్పారు. పవన్ స్టైల్ పోలీస్ అవతార్, హరీష్ శంకర్ మార్క్ మాస్ టేకింగ్ కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్'ను మరో కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెడతాయా అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X