twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్ సాబ్‌కు రికార్డు ఓపెనింగ్స్.. ఫస్ట్‌డే టిక్కెట్లు ఖల్లాస్.. హైదరాబాద్‌లో తొలిరోజు ఎన్ని షోలు అంటే!

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ రిలీజ్‌కు ముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. లాక్‌డౌన్ సమయంలో కుదేల్ అయిన తెలుగు సినిమా పరిశ్రమకు ప్రోత్సాహం అందించేలా ఈ చిత్రం రికార్డుల దిశగా ప్రయాణిస్తున్నది. ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్, ప్రదర్శన వివరాలు క్రేజీగా మారాయి. వకీల్ సాబ్ సృష్టిస్తున్న హంగామా వివరాలు మీ కోసం..

    తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య స్పందన

    తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య స్పందన


    తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్‌ చిత్రం భారీ అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. తొలి రోజునే రికార్డు స్థాయిలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్, వైజాగ్, ఒంగోలు, నెల్లూరు, గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరులో భారీ స్పందన కనిపిస్తున్నది.

    హైదరాబాద్‌లో ఎన్ని ప్రదర్శనలంటే

    హైదరాబాద్‌లో ఎన్ని ప్రదర్శనలంటే

    తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో మొత్తంగా 364 ప్రదర్శనలు, వైజాగ్‌లో 65 షోలు, ఒంగోలులో 25 షోలు, నెల్లూరులో 16 షోలు, గుంటూరులో 51 షోలు, కడపలో 24 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా పలు పట్టణాల్లో ప్రదర్శన వివరాలు అందాల్సి ఉంది. అయితే అన్ని చోట్ల భారీగా రెస్పాన్స్ కనిపిస్తున్నదనే విషయాన్ని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

    హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

    అన్ని చోట్ల భారీగా అక్యుపెన్సీ నమోదు

    అన్ని చోట్ల భారీగా అక్యుపెన్సీ నమోదు

    ఇక అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. తొలి రోజున హైదరాబాద్‌లో 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీని, వైజాగ్‌లో 95 శాతానికి పైగా అక్యుపెన్సీ, ఒంగోలులో 90 శాతం అక్యుపెన్సీ, నెల్లూరులో 100 శాతం, గుంటూరులో 80 శాతం, కడపలో 70 శాతం అక్యుపెన్సీ నమోదు చేసింది. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఊపే కనిపిస్తున్నదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలో

    ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలో

    కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఘనంగా మొదలయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలో అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది. చెన్నైలో 78 ప్రదర్శనలు, బెంగళూరులో 153 షోలు ప్రదర్శిస్తున్నారు. చెన్నైలో 56 శాతం అక్యుపెన్సీ, బెంగళూరులో 45 శాతం అక్యుపెన్సీ నమోదైంది. తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఉండటంతోపాటు పవన్ కల్యాణ్ సినిమా కావడంతో వకీల్ సాబ్‌పై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.

    Recommended Video

    Pawan Kalyan Reaction After Watching Vakeel Saab
    యూఎస్‌లో 280 స్క్రీన్లలో

    యూఎస్‌లో 280 స్క్రీన్లలో

    ఇదిలా ఉండగా, అమెరికాలో వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్‌ గ్రాండ్‌గా మొదలైంది. యూఎస్‌లో 280 స్క్రీన్లకుపైగా పవర్ స్టార్ మూవీని ప్రదర్శించనున్నారు. ఇండియాలో కంటే ఒకరోజు ముందుగానే అంటే గురువారమే యూఎస్‌లో ప్రీమియర్లు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    English summary
    Sri Venkateswara Creations, Bay View Projects's Vakeel Saab is set release on April 9th. Dil Raju and Shirish Reddy are the producers and Boney Kapoor is the presenter. Before this movie release, unit organised Pre release event in Hyderabad. Apart from this, movie opened record advance booking openings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X