‘వకీల్ సాబ్’ మూవీ సెన్సార్ రిపోర్ట్: ఆమె ఎంట్రీ ఇవ్వడంతో భారీగా పెరిగిన రన్ టైమ్

పవర్ స్టార్ పవన్ కల్యాన్ హీరోగా వేణు శ్రీరామ్ రూపొందిస్తోన్న చిత్రం 'వకీల్ సాబ్'. బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన 'పింక్'కు ఇది రీమేక్‌గా వస్తోంది. మధ్య తరగతికి చెందిన ముగ్గురు అమ్మాయిలు అనుకోకుండా ఓ కేసులో చిక్కుకుంటారు. వాళ్లను కాపాడేందుకు లాయరైన హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్న కథతో ఈ చిత్రం రూపొందింది. సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగా విడుదల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' రన్ టైమ్‌పై ఓ న్యూస్ వచ్చింది.

చీరకట్టులో హంస నందిని సోయగాలు... స్లీవ్ లెస్ జాకెట్‌తో మరింత అందంగా

బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన చిత్రమే 'పింక్'. దీన్ని తమిళంలో అజిత్ కుమార్ 'నెర్కొండ పార్వాయి' పేరిట రీమేక్ చేశాడు. ఇప్పుడిదే కథతో పవన్ కల్యాన్ 'వకీల్ సాబ్' అనే మూవీ చేశాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు సమాచారం. ఇక, ఈ మూవీ రన్ టైమ్ 154 నిమిషాలుగా ఉందనే టాక్ వినిపిస్తోంది. హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులో మూవీ రన్ టైమ్ ఎక్కువగా ఉందట. దీనికి కారణం ఇందులో హీరోయిన్ శృతి హాసన్ సీన్స్ యాడ్ చేయడమేనని అంటున్నారు.

 Pawan Kalyans Vakeel Saab Run Time

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వకీల్ సాబ్'ను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అలాగే, సినిమా బిజినెస్ కూడా గణనీయంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X