BRO ఓవర్సీస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ అదరహో.. తెలుగులో ఆ ఒక్క సిటీలోనే మైనస్
'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' చిత్రాలతో వరుసగా సక్సెస్ లను అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన మేనల్లుడు మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఈ సినిమా నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజై ఆకట్టుకుంటోంది. సినిమా అదిరిపోయిందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బుకింగ్స్, సోల్డ్ ఔట్ అయిన టికెట్ వివరాలు, ఓవర్సీస్ వసూళ్ల డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.
బాగా శ్రద్ధతో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో రిలీజ్ అయిన క్రేజీ మల్టీస్టార్ మూవీ 'బ్రో'. యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేడు జూలై 28వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందించారు. పవన్ ను దృష్టిలో పెట్టుకుని మరీ అంత శ్రద్ధగా రాశారంట.

ఓవర్సీస్ లో భారీగా వసూళ్లు... :పవన్ కల్యాణ్ కు ఓవర్సీస్ లోనూ మంచి మార్కెటే ఉంది. అక్కడ కూడా ఆయనకు భారీ స్థాయిలోనే అభిమానులు ఉన్నారు. దీంతో 'బ్రో' సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ సేల్స్ కూడా బాగా జరిగాయని తెలిసింది. అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం శుక్రవారం తెల్లవారుఝామున 4.30 గంటల వరకు ఓవర్సీస్ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నార్త్ అమెరికాలో 243 లొకేషన్స్ లో సినిమా ప్రదర్శన అవ్వగా 523,169 డాలర్లు వసూలు అయ్యాయని తెలిసింది. యూఎస్ ఏలో 482,463 డాలర్లు కలెక్ట్ అయ్యాయట. కెనడాలో 40,706 డాలర్లు వసూలు అయ్యాయని సమాచారం అందింది.
ఆ ఒక్క సిటీ తప్ప తెలుగు రాష్ట్రాల్లో జోరు.. :తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ ముందు సందడే సందడి. అనుకున్నట్టుగానే 'బ్రో' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలోని మేజర్ సిటీస్,టౌన్స్ లో ప్రీమియర్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఊహించని రేంజ్ లో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో 700 షోస్ కి 600 షోలు త్వరగా ఫిల్ అయిపోయాయి.

వైజాగ్ అయితే 290కి ఏకంగా 278 షోస్ ఫిల్ అవ్వడం మరింత విశేషం. అలాగే విజయవాడ 230/230, గుంటూరు 120/135, కాకినాడ 76/80, రాజమండ్రి 52/52, తిరుపతి 48/53, నెల్లూరు 60/62.. మొత్తంగా చూస్తుంటే ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ లోనే కాస్త తక్కువ అయినట్లు అనిపిస్తోంది. ఏదేమైనా ఈ లెక్కన చూస్తే ఓపెనింగ్స్ వసూళ్లు రికార్డులు అదిరిపోయేలా ఉన్నాయి.
బ్రో మూవీ ట్విట్టర్ రివ్యూ.. :'బ్రో' సినిమా అందరూ బాగుందని అంటున్నారు. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోందట. సాంగ్స్ అలాగే మంచి అనుభూతి కలిగించే సన్నివేశాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. మఖ్యంగా డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతాయని పేర్కొంటున్నారు. అయితే సెకండాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్లు, బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ను ఎలివేట్ చేసేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని కూడా అంటున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో .. ఫ్యాన్స్ కు ఫీస్టే అని సింగిల్ డైలాగ్ లో రివ్యూలు ఇస్తున్నారు.

సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా.. :ఇకపోతే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ - సాయితేజ్ తో పాటు హీరోయిన్లుగా కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. బ్రహ్మనందం సహా పలువురు నటులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'వినోదయ సీతమ్' కు రీమేక్ గా దీన్ని రూపొందించారు. ఈ ఒరిజినల్ వెర్షన్ కు కూడా సముద్రఖనినే దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











