Bro: పవన్ కల్యాణ్ బ్రో సంచలనం.. దుమ్ము దులుపుతున్న మామ అల్లుళ్లు
మామ అల్లుళ్లు అయినా పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో (Bro Movie). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా, వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బ్రో మూవీ పోస్టర్స్, ఫస్ట్ లుక్స్, పాటలకు విపరీతమైన స్పందన రాగా జూలై 22న సాయంత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అత్యధిక మిలియన్ వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది.
ఎన్నో అంచనాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ మూవీ బ్రో. ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించగా.. స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలు చేపట్టారు. ఇక సంగీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మలు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తూ అందాలు ఆరబోసేందుకు రెడీ అయ్యారు.

ఇక బ్రో సినిమాను జూలై 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మై డియర్ మార్కండేయా, జాణవులే వంటి పాటలు మంచి హిట్స్ సాధించగా.. పవన్, సాయి తేజ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శనివారం సాయంత్రం వైజాగ్ జగదాంబ థియేటర్, హైదరాబాద్ దేవి థియేటర్ వేదికగా బ్రో ట్రైలర్ విడుదల చేశారు.
జగదాంబ థియేటర్ కు అతిథులుగా సాయి ధరమ్ తేజ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు. దేవి థియేటర్ కు డైరెక్టర్ సముద్రఖని, తమన్ ఎస్, హీరోయిన్ కేతిక శర్మ, వివేక్ కూచిబోట్ల హాజరయ్యారు. భారీ అభిమానుల సమక్షంలో విడుదలైన బ్రో ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు బ్రో ట్రైలర్ కు 23 మిలియిన్లకుపైగా రియల్ టైమ్ వ్యూస్ వచ్చినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే 5 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయని, యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ 1గా ఉందని చెప్పుకొచ్చింది. ఇది పవన్ కల్యాణ్ సంచలనంగా అభిమానులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











