Bro Trailer Review: మాస్ అవతారాలతో పవన్ కల్యాణ్.. టైమ్ లేదు బ్రో.. ట్రైలర్ అదిరిందిగా!

ఇప్పటివరకు మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా నటించిన బ్రో సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. జూలై 22న అంటే ఇవాళ బ్రో ట్రైలర్ ప్రకటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బ్రో ట్రైలర్ ను రెండు ప్లేసుల్లో అభిమానుల మధ్య రిలీజ్ చేశారు. వైజాగ్ లోని జగదాంబ థియేటర్ ఒకటి కాగా.. రెండోది హైదరాబాద్ లోని దేవి థియేటర్ బ్రో ట్రైలర్ విడుదలకు వేదికయ్యాయి. మరి ఎంతో ఊరించిన బ్రో ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

మంచి హిట్స్:తెలుగు చిత్ర పరిశ్రమలో మామ అల్లుళ్లు అయినా పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం బ్రో. ఇటీవల మంచి హిట్స్ అందుకున్న ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. దీని బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహించారు.

త్రివిక్రమ్ అలా:పవన్-సాయి తేజ్ కాంబో అయినా బ్రో సినిమాకు స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలు చేపట్టారు. ఇక సంగీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించారు. ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో ముద్దుగుమ్మలు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Trailer Released And Goes Viral

విభిన్న గెటప్పులు:బ్రో సినిమాను జూలై 28న ప్రేక్షకుల ముందుకు వరల్డ్ వైడ్ గా తీసుకురానున్నారు. ఇక తాజాగా విడుదలైన బ్రో ట్రైలర్ ఎంతో ఆసక్తిగా ఉంది. ప్రారంభంలో భస్మాసూరుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా.. మీ మనుషులందరూ వాడి వారసులు. ఎవడి తలమీద వాడే పెట్టుకుంటాడు. ఇంకెవ్వడికి ఛాన్స్ ఇవ్వడు అంటూ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్ ఆసక్తి పెంచింది. టైమ్ లేదండూ సాయి ధరమ్ తేజ్ కు తైనే టైమ్ అంటూ పవన్ కల్యాణ్ ప్రత్యక్షం అడవం ఇంట్రస్టింగ్ గా ఉంది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Trailer Released And Goes Viral

బ్రహ్మానందం కూడా:బ్రో ట్రైలర్ లో పవన్ కల్యాణ్ డ్రైవర్, వాచ్ మెన్, డాక్టర్ ఇలా విభిన్న గెటప్స్ వేసి ఆశ్యర్యపరిచారు. సినిమాలో ఎంటర్టైనింగ్ కామెడీతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కల్యాణ్ యాక్టింగ్ ఎప్పటిలానే అదిరిపోయేలా ఉంది. అలాగే ఇందులో బ్రహ్మానందం కూడా కనిపించి కామెడీ పండించనున్నారని అర్థం అవుతోంది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Trailer Released And Goes Viral

మళ్లీ బతికి చచ్చా:అందరూ టైమ్ లో ముందుకెళ్తుంటారు. నువ్వు ఒక్కడివే వెనక్కి వెళ్తున్నావ్ అని సాయి ధరమ్ తేజ్ ను పవన్ కల్యాణ్ అనడం బ్రో సినిమాకు హింట్ ఇచ్చినట్లుగా ఉంది. చచ్చి బతికిపోయానన్న మాట. కానీ, అనవసరంగా బతికి చచ్చాను అని సాయి తేజ్ డైలాగ్ అతని పాత్ర చనిపోతే.. మళ్లీ బతికి వచ్చేలా పవన్ కల్యాణ్ పాత్ర చేస్తాడని తెలుస్తోంది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Trailer Released And Goes Viral

అందుకే చంపేసా:ఇక చివర్లో మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ వేసే స్టెప్పులు, కామెడీ ఉత్సాహం పెంచేలా ఉన్నాయి. జల్సా మూవీలోని స్టిల్ ను ఇందులో పవన్ కల్యాణ్ మరోసారి వేశి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. రమ్య లిప్ స్టిక్ తీస్తే ఎలా ఉంటుందో కూడా తెలియదు బ్రో. ఛీ ఎధవ జీవితం అని సాయి తేజ్ అంటే.. అందుకే చంపేసా అని పవన్ కల్యాణ్ డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తిగా ముగించారు. ఇక బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ ను జూలై 25న హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో నిర్వహించనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X