Official Bro: బ్రో మూవీ నుంచి సూపర్ అప్డేట్.. ఎంటో తెలిస్తే పండగే!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా పలు విభాగాల్లో అదరగొట్టి సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే విరూపాక్ష సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన మూవీ బ్రో. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ దూసుకుపోతుంటే అభిమానులకు సరికొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
బ్రో సినిమాకు టాలీవుడ్ లో ఇటీవల మంచి హిట్స్ అందుకున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి మరో సహా నిర్మాతగా వివేక్ కూచిబోట్ల వ్యవహరించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలి కాంబినేషన్ అయిన ఈ బ్రో చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. కథనం, సంభాషణలను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ, వింక్ భామ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న బ్రో చిత్రంలోని ఫస్ట్ లుక్స్, పోస్టర్స్, పాటలకు సూపర్ క్రేజ్ వచ్చింది. వాటన్నింటికి మించి ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ కు 23 మిలియన్లకుపైగా రియల్ టైమ్ వ్యూస్ తోపాటు 500 లైక్స్ వచ్చాయి. యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
జూలై 28న ప్రపంచవ్యాప్తంగా బ్రో సినిమాను విడుదల చేయనున్నారు. దానికంటే ముందు ఓ క్రేజీ న్యూస్ చెప్పారు. బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విడుదలకు 3 రోజుల ముందు జరిపించనున్నారు. అంటే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 25న జరగనుంది. అందుకు హైదరాబాద్ లోని శిల్పాకళా వేదిక చిరునామా కానుంది. శిల్పా కళా వేదికలో జూలై 25న సాయంత్రం 6 గంటల నుంచి బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రేయాస్ మీడియా చూసుకుంటుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరస్తారనేది క్లారిటీ రాలేదు. కానీ, మెగాస్టార్ చిరంజీవినే స్పెషల్ గెస్ట్ అంటూ ప్రచారం మాత్రం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











