సినీ హీరోలు దోపిడిలు చేయరు.. వాళ్ల మాదిరిగా కబ్జాలు చేయరు.. ఏపీలో ఆ పరిస్థితి ఆ ఇద్దరి వల్లే.. పవన్ కల్యాణ్
బ్రో సినిమా నాకు ప్రత్యేకమైనది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు సన్నిహితుడు. ఆయనతో కలిసినప్పుడు మేము సాహిత్యం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్, సైన్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. ఆయన సాహిత్యంపై పట్టు సాధించి ప్రముఖ దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా సినిమా పరిశ్రమలో గొప్ప స్థానాన్ని సొంతం చేసుకొన్నాడు. ఆయనకు మీ తరఫున పేరు పేరునా ధన్యవాదాలు అని పవన్ కల్యాణ్ చెప్పారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కేవలం తెలుగు మీదనే పట్టు లేదు. సంస్కృతం, హిందీ భాషలపై గట్టి పట్టు ఉన్న వ్యక్తి, పండితుడు. నీ స్నేహితుడు చూపిస్తే.. నీవేంటో చెబుతామని అంటారు. అలాంటి స్నేహితుడు నాకు త్రివిక్రమ్. నేను ఆయనను గురువు స్థానంలో పెడుతాను. నాకు చాలా విషయాలు తెలియవు. పురాణాలు, సాహిత్యం, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా లాంటి ప్రముఖుల గురించి గొప్పగా తెలిసిన వ్యక్తి అని పవన్ కల్యాణ్ తెలిపారు.

తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు భాషకు మక్కువ వచ్చిందంటే కారణం తివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్లు మార్గదర్శకం చేయడం వల్లే. ఆయన ప్రేరణగా తీసుకొని యువ రచయిత మరింత మంది రావాలని కోరుకొంటాను. తెలుగు సాహిత్యంపై పట్టు సాధించి రాజమౌళి మాదిరిగా తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. మహేష్ బాబుతో రాజమౌళి చేసి సినిమా కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని కోరుకొంటున్నాను అని అన్నారు.
సినిమా నటులంటే నాకు చాలా ఇష్టం. మిగితా వాళ్ల మాదిరిగా వాళ్లు దోపిడిలు చేయరు. ఇతర వస్తువుల లాగేసుకోరు. సినిమా హీరోలు కష్టపడుతారు. ఒక హీరో సినిమా చేస్తే 200 మంది కుటుంబాలకు మంచి జరుగుతుంది. ఒక హీరో సినిమా చేస్తే 100 మంది వరకు జీఎస్టీ, ట్యాక్స్‌లు కడుతారు. టెక్నికల్‌గా 24 రంగాలు పనిచేస్తాయి. హీరోలంటే వ్యక్తిగతంగా గౌరవం. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అందరూ కష్టపడుతారు అని ఏపీలోని కొందరు రాజకీయ నేతలను టార్గెట్ చేసి పరోక్షంగా విమర్శలు చేశారు.

నేను సినిమా చేసేటప్పుడు పెద్ద హిట్ కొట్టాలని కోరుకొంటాను. సినిమా చేసేటప్పుడు పోటీతత్వం లేకపోతే రాణించలేం. RRR, బాహుబలి సినిమాలను చూసినప్పుడు అలాంటి సినిమాలను కొట్టే సినిమాలు చేయాలనిపిస్తుంది. శాశ్వతంగా సినిమాల్లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు ఆ మైండ్ సెట్ లేదు. అలా ఘనతను ఎవరు సాధించినా నేను మనస్పూర్తిగా ప్రశంసిస్తాను. దాని వల్ల క్వాలిటీ పెరుగుతుంది. ఆర్థికాభివృద్ది ఉంటుంది అని పవన్ కల్యాణ్ అన్నారు.
సముద్రఖని తెలుగు వారు కాకపోవచ్చు. కానీ తెలుగు సినిమా చేసిన తమిళ భారతీయుడిగా భావిస్తాను. బ్రో సినిమాకు సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫిని అందించారు. నేను 21 రోజుల్లో సినిమా పూర్తి చేయగలిగాననంటే సముద్రఖని, సుజిత్ వల్లే. వారిద్దరి కాంబినేషన్ వల్లే ఆంధ్రాలో తిరిగే పరిస్థితి కలిగింది.


Click it and Unblock the Notifications











