Modi 3.O: కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం.. వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా పవన్ కల్యాణ్
లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరేందుకు సిద్దమైంది. ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా గెలిచిన ఎంపీలు నుంచి ప్రముఖులను, పార్టీకి సేవలందించిన నేతలకు, కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఎంపీలకు మంత్రి పదవులను కట్టబెట్టేందుకు రంగం సిద్దమైంది. ప్రదాని మోదీ నాయకత్వంలో పనిచేసే మంత్రుల ప్రమాణ స్వీకారం ఢిల్లీోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, తన సతీ అన్నా లెజనోవాతో కలిసి హాజరయ్యారు. అయితే ప్రధాని మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో మరోసారి పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ బిజీగా మారిపోయారు. దేశ రాజధానిలో జరిగిన ఎన్డీఏ, ఇతర కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ జాతీయ మీడియాలో హైలెట్ అయ్యారు.

ఇక కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం కోసం పవన్ కల్యాణ్, తన సతీమణితో కలిసి వెళ్లారు. ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. పలువురు నేతలు, అధికారులు పవర్ స్టార్‌తో మాట్లాడేందుకు ఉత్సాహం చూపారు. మీడియా పవన్ దంపతులను కెమెరాలో బంధించేందుకు పోటీ పడ్డారు.

ఇక కేంద్ర మంత్రి వర్గ ప్రమాణా స్వీకారానికి హాజరైన పవన్ కల్యాణ్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోసారి జాతీయ స్థాయిలో, నేషనల్ మీడియాలో జనసేనాని హైలెట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











