ఆస్తులను అమ్మకానికి పెట్టిన పవన్ కల్యాణ్.. ప్రజలు, పార్టీ కోసం సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కోసం.. సామాజిక కార్యక్రమాల కోసం పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. తాను స్వయంగా సంపాదించిన ఆస్తులను అమ్మకాలు జరిపి జనసేన పార్టీ కోసం 100 కోట్ల ఫండ్ ఏర్పాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకొన్నాడనే విషయం పార్టీ వర్గాల్లో చర్చనీయీంశమైంది. పవన్ కల్యాణ్ తీసుకొన్న ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

గతంలో పవన్ కల్యాణ్ తన పిల్లల పేర్ల మీద ఫిక్స్ చేసిన డిపాజిట్లను ఏపీలోని జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఖర్చు చేశారు. అలాగే తాను నటించిన సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ను ఉద్దానం బాధితులు, అలాగే పలుచోట్ల రైతులకు విరాళంగా అందించిన విషయం తెలిసిందే.

Pawan Kalyan Sells House and His personal assets for Andhra Pradesh Elections and JanaSena Party Fund

అయితే 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల కోసం ఎవరి వద్ద నుంచి పార్టీ ఫండ్ తీసుకోవడానికి నిరాకరించిన పవన్ కల్యాణ్ తన సొంత ఆస్తులను అమ్మాలని నిర్ణయం తీసుకోన్నారు. గతవారం హైదరాబాద్‌లోని ఇంటి స్థలాన్ని అమ్మివేవారు. అలాగే హైదరాబాద్‌లో తన పేరిట ఉన్న మరో రెండు, మూడు స్థలాలను అమ్మకానికి పెట్టినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పవన్ కల్యాణ్ తీసుకొన్న ఈ సంచలన నిర్ణయంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలోని ప్రజలకు, అభిమానుల, జనసేన కార్యకర్తలు తమ నాయకుడు తీసుకొన్న నిర్ణయాన్ని చూసి గర్వంగా ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో పవన్ ఆస్తుల అమ్మకం వ్యవహారం ట్రెండింగ్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X