twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 పై పవన్ సంచలన కామెంట్స్.. చిత్ర పరిశ్రమ ఆ హీరోలది కాదంటూ..

    |

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కార్తికేయ 2 సినిమాపై ఇప్పుడు రాజకీయ ప్రముఖులు అలాగే ఇతర పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ సినిమాతో కెరీర్ లోనే నిఖిల్ అతిపెద్ద సక్సెస్ సొంతం చేసుకోబోతున్నట్లు బాక్సాఫీస్ కలెక్షన్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. అయితే ఈ తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కార్తికేయ 2 సినిమా పై ఊహించని విధంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఊహించని విజయం

    ఊహించని విజయం

    2014లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద ప్రతిరోజు ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంది. చందు మొండేటి దర్శకత్వంలో శ్రీకృష్ణ దైవత్వం హైలెట్ అయ్యేలా మిస్టరీ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా సంచలన విజయాన్ని అందుకుంది. అక్కడ మొదట కేవలం 50 స్క్రీన్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మాత్రం మూడు వేలకు పైగా థియేటర్లలో కొనసాగుతుంది అంటే ఏ స్థాయిలో క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    ప్రముఖుల ప్రశంసలు

    ప్రముఖుల ప్రశంసలు

    ముఖ్యంగా హిందీలోనే భారీ స్థాయిలో స్పందన లభిస్తూ ఉండడం విశేషం. ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అయితే అందించింది. ఇక ఈ సినిమాను చూడాలని ప్రముఖ రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. కొంతమందికి చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా స్పెషల్ షో కూడా ప్రదర్శిస్తున్నారు.

    కార్తికేయ 2పై పవన్ రియాక్షన్

    కార్తికేయ 2పై పవన్ రియాక్షన్

    అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా గురించి ఒక మీటింగ్లో ప్రస్తావించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక వర్గం వారికే రాజకీయాల్లో గుర్తింపు లభిస్తుంది అని అందరిని రానివ్వడం లేదు అని అధికారం పక్షంపై పవన్ కళ్యాణ్ కొన్ని విమర్శలు చేశారు అయితే ఇదే తరుణంలో ఆయన కార్తికేయ 2 సినిమాపై ఒక ఉదాహరణ కూడా చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆ సినిమా దేశంలో దులిపేసే విషంగా కొనసాగుతోందని అన్నారు.

    పరిశ్రమ అగ్ర హీరోలది కూడా కాదు

    పరిశ్రమ అగ్ర హీరోలది కూడా కాదు

    ఈ రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ఒకరిది కాదు. ఒక మెగా ఫ్యామిలీది కూడా కాదు. ఎంత మాత్రం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ కొద్ది మంది అగ్ర హీరోలది కూడా కాదు. ఒక కులానిది కూడా కాదు. ఇప్పుడు కార్తికేయ 2 అనే ఒక సినిమా వచ్చి దేశమంతా దులిపేస్తోంది. యువ హీరో నిఖిల్ మంచి గుర్తింపును అందుకుంటున్నాడు. ఇదే విధంగా నేను మార్పు రావాలి అని కోరుకుంటున్నాను. ఇది మాది అనుకోడానికి లేదు. ఇందులో అందరూ రావాలి అని నేను భావిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

    English summary
    pawan kalyan sensational comments on karthikeya 2 movie result
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X