హరిహర వీరమల్లు టికెట్ల రేట్ల పెంపు.. పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి షాక్!
నలుగురికి మంచి విషయాలు చెప్పడమే కాదు.. ఆచరించే విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారు. అలాగే సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గదర్శిగా మారుతారని చాలా విషయాల్లో ఇప్పటికే నిరూపించారు. సొంత లాభం కొంత మానుకొని.. వ్యవస్థకు మేలు చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. అయితే తన హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా పవన్ కల్యాణ్ తన దారి, నిర్ణయం ఏంటో చెప్పకనే చెప్పేశారు. పవన్ నిర్ణయంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్‌లో ఉండిపోయారు. పవన్ కల్యాణ్ తీసుకొన్న నిర్ణయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లోను, తెలుగు సినిమా పరిశ్రమలోను అత్యంత వివాదాస్పద అంశం టికెట్ రేట్ల పెంపు. సినిమా టికెట్ల రేట్ పెంపు విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన గొడవలు అంతా ఇంతా కాదు. తాజా కూటమి ప్రభుత్వంలో సినిమా పరిశ్రమకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. దాంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.

అయితే తాజాగా థియేటర్ల బంద్ వివాదం తర్వాత కూటమి ప్రభుత్వం ఆచీ తూచీ వ్యవహరిస్తున్నది. తమవైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా జాగ్రత్తలు పడుతున్నది. ఇండస్ట్రీ నుంచి ఏవైనా ప్రతిపాదనలు వస్తే గానీ వాటిపై స్పందించకూడదని నిర్ణయం తీసుకొన్నది. వ్యక్తులు, నిర్మాతలు వ్యక్తిగతం వస్తే అనుమతులు ఇవ్వకూడదనే విషయంపై స్పష్టమైన సంకేతాలను హరిహర వీరమల్లు విషయంలో ఇచ్చినట్టు సమాచారం.
అయితే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో టికెట్ రేట్ల విషయంలో పవన్ కల్యాణ్ క్లారిటీతో ఉన్నారు. ఆయన తన నిర్మాత ఏఎం రత్నంకు ఫోన్ చేసి.. టికెట్ రేట్ల పెంపు విషయంలో తనను కలువవద్దని ఫోన్ చేసి చెప్పారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ప్రతిపాదన చేస్తే.. వారు పంపే ప్రతిపాదన ఆధారంగా టికెట్ రేట్ల పెంపు విషయాన్ని ప్రభుత్వం పరిశీలించి ఓ నిర్ణయం తీసుకొంటుందని ఆయన చెప్పినట్టు తాజాగా ప్రముఖ మీడియా బిగ్ టీవీ ఓ కథనాన్ని ప్రచురించింది.


Click it and Unblock the Notifications











