ఆలీకి పవన్ కల్యాణ్ షాక్: నాతో వద్దు, ఇబ్బందులు ఉంటాయ్.. ఇష్టమున్న పార్టీలోకి వెళ్లు..
నటుడిగా, కమెడియన్‌గా, హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న ఆలీ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం మీడియా, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అనేక ఊహాగానాల మధ్య సోమవారం (మార్చి 11న) వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...

పార్టీ విధానాలు నచ్చడం వల్లే
సినిమాలో ఎన్టీఆర్ అభిమానిని. రాజకీయాల్లో వైఎస్ఆర్ ఫ్యాన్‌ను. ఆయన కుమారుడు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు చూసి, నచ్చడం వల్లనే చేరాను. ప్రస్తుతం వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే నా ధ్యేయం. ఈ ఎన్నికల్లో నేను ప్రచారానికి పరిమితం అవుతాను. నేను డబ్బులు సంపాదించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. సేవ చేయడానికి నేను వైసీపీలో చేరాను.

బాబు, పవన్‌ను కలిసింది నిజమే
గతంలో నేను చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసింది నిజమే. కానీ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికే కలిశాను. కానీ ఆ కలయిక అనేక రూమర్లకు దారి తీసింది. సోషల్ మీడియాలో గందరగోళానికి కారణమైంది. అభిమానులు, ప్రజలు ఏదేదో ఊహించుకొన్నారు. దాంతో చాలా రకరకాల వార్తలు వినిపించాయి.

పవన్ కల్యాణ్‌ను వదిలేయలేదు
పవన్ కల్యాణ్ నాకు మంచి స్నేహితుడు. ఆయనను వదిలేయలేదు. ఆయన సక్సెస్ సాధిస్తే నేను సక్సెస్ అయినట్టే. అభిమానులు తప్పుగా అర్ధం చేసుకోరు. చాలా మంచివాళ్లు. మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి ఫ్యాన్స్‌కు తెలుసు. నాపై ట్రోల్స్ చేస్తే వారికే చెడు జరుగుతుంది.

పవన్ కల్యాణ్ ఇష్టపడలేదు
జనసేనలో చేరడానికి ప్రయత్నించాను. కానీ పవన్ కల్యాణ్ ఇష్టపడలేదు. రాజకీయాల్లో నాతో ప్రయాణిస్తే కొన్ని సమస్యలు, ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అందుచేత జనసేనలో చేరలేదు. ఆయన నా ఇష్టం ఉన్న పార్టీలో చేరమని చెప్పారు. ఆయన సలహా మేరకే నేను నాకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకొన్నాను.


Click it and Unblock the Notifications











