గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన పవన్‌కల్యాణ్
Pawan Kalyan- Allu Arjun: సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సోమవారం నాడు మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రేవతి అనే మహిళ చనిపోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు సినిమా పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తాయని అభిప్రాయపడ్డారు. సినిమా అనేది ఒక టీం వర్క్ అని థియేటర్ వద్ద జరిగిన ఘటనకు కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే బాధ్యులు చేయడం సరి కాదని, మూవీ యూనిట్ మొత్తం బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు.
రేవతి అనే మహిళా అభిమానురాలు చనిపోయిన వార్త తన మనసును ఎంతో కలిచివేసిందని, ఇలాంటి విషాద ఘటనలు అభిమానుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. అల్లు అర్జున్ తరఫున ఎవరో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని, వారిని పరామర్శించి ఉంటే ఈ వివాదం జరిగేది కాదని, గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఘటనలో మానవతా దృక్పథం లోపించినట్లు తనకు అనిపిస్తుందని, బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపి అండగా ఉన్నామని చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు.

అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్న అలానే అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. అయితే అల్లు అర్జున్ తన పేరు చెప్పలేదని రేవంత్ రెడ్డి కావాలని అరెస్టు చేయించారు అనడం తప్పు అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. రేవంత్ రెడ్డి లీడర్ అని, సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే పుష్ప సినిమా టికెట్ రేట్లను బెనిఫిట్ షోస్ లకు అనుమతిచ్చారంటూ తెలియజేశారు. ఇలా చేయడం పరిశ్రమలను ప్రోత్సహించడమే కదా అని వివరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని కిందిస్థాయ నుండి ఎదిగారంటూ ప్రశంసించారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని, సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలనే బెనిఫిట్ షో లు టికెట్ ధర పెంపునకు అవకాశం ఇచ్చారని మరోసారి పేర్కొన్నారు ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ ఆదరణ చూపుతున్నారని అన్నారు. హీరోలు వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు, అల్లు అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు.

కళాకారులకు ఒక పొగడ్త అవార్డు అనేది విలకట్టలేదన్నారు. అల్లు అర్జున్ పై ప్రజలలో వేరే భావన వస్తుందని, ఈ ఘటనలో తన వల్ల ఓ మహిళ చనిపోయారని వేదన అల్లు అర్జున్ లో ఉందని, ఆ బిడ్డను ఆదుకోవడం కోసం భరోసా ఇవ్వాలని, అయితే ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒకడిని దోషిగా మార్చడం సరికాదని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











