మళ్లీ పాట పాడుతున్న పవన్: క్రేజీ మూవీలో ఎవరూ ఊహించని విధంగా!
వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే రాజకీయాల కోసం గ్యాప్ ఇచ్చి.. ఆ విరామాన్ని ఇప్పుడు భర్తీ చేయడానికి పాటు పడుతున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందులో భాగంగానే రీఎంట్రీలో కొన్ని సినిమాలను కూడా ప్రేక్షకులకు అందించాడు. ఇక, ఇప్పుడేమో చేతిలో నాలుగైదు ప్రాజెక్టులను పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ప్రస్తుతం ఈ మెగా హీరో చేస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు ఒకటి'. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
పిరియాడిక్ జోనర్‌లో మొగల్ సామ్రాజ్యం బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఆటంకాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే, పవన్ కల్యాణ్ వేరే చిత్రాల షూట్‌లతో బిజీగా ఉండడంతో దీనికి సరైన సమయాన్ని కేటాయించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఫాంటాస్టిక్ న్యూస్ లీకైంది.

పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీకి RRRతో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓ పాటను పాడుతున్నాడని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్యూన్ కూడా పూర్తైనట్లు సమాచారం. ఈ పాట ఎంతో కష్టంతో కూడుకుని ఉంటుందట. గతంలో పవన్ ఎప్పుడూ ఇలాంటిది ట్రై చేయలేకపోయినా.. దీన్ని పాడటానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఇది ఈ మూవీలోని మేజర్ హైలైట్లలో ఒకటిగా నిలుస్తుందని టాక్.
'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ కాగా.. నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











