Pawan Kalyan Son Health Bulletin: పవన్ కుమారుడి హెల్త్ బులెటిన్.. మరో మూడు రోజులు హాస్పిటల్ లోనే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ నిన్న అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పవన్ తనయుడు చదువుకుంటున్న స్కూల్ లోని ఓ భవంతిలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సింగపూర్ లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు తన స్కూలింగ్ పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి మార్క్ శంకర్ స్కూల్లో, ఆయనున్న భవనంలోనే మంటలు చెలరేగాయి. ఒక్కసారి భయాందోళన వాతావరణం ఏర్పడింది.

మార్క్ శంకర్ కూడా మంటలు చెలరేగిన భవనంలోనే ఉన్నారు. దాంతో మంటల్లో బాలుడు చిక్కుకుపోయాడు. స్పందించిన స్కూల్ సిబ్బంది వెంటనే మార్క్ శంకర్ తోపాటు మిగితా పిల్లలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పేశారు. కానీ అప్పటికే మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు చెలరేగిన మంటల కారణంగా గాయాలయ్యాయి. మరోవైపు దట్టమైన పొగ రావడంతో ఊపిరితిత్తుల్లోకి నిండిపోయింది. దాంతో మార్క్ శంకర్ కు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది.

Pawan Kalyan Son Mark Shankar Health Bulletin

ఇక హుటాహుటిన మార్క్ శంకర్ ను సింగపూర్ లోని ఆస్పత్రికి తరలించారు. నిన్న ఉదయం నుంచి పవన్ తనయుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దాంతో అతనికి ఎలా ఉందంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా మార్క్ శంకర్ కు సంబంధించిన ఫస్ట్ హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు... బాలుడి చేతులు, కాళ్లు మంటలకు గాయపడటంతో ఎమెర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో పొగ చూరడంతో తలెత్తే సమస్యలను అడ్డుకునేందుకు తగిన పరీక్షలు నిర్వహించారు.

ఒక్కరోజు పాటు మార్క్ శంకర్ అత్యవస వార్డులోనే చికిత్స పొందారు. ఇక తదుపరి అందిన రిపోర్టులు ఆధారంగా మరో మూడు రోజుల పాటు బాలుడిని ఆస్పత్రిలోనే ఉంచుతున్నారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణలోనే పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆస్పత్రి బృందం తెలిపింది.... ఇక ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకపోయినా కోలుకోవడానికి మూడు రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అత్యవసర వార్డు నుంచి నార్మల్ గదిలోకి షిఫ్ట్ చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ కు నిన్న ఉదయమే ఈ సంగతి తెలిసింది. దాంతో అప్పటికే తనకు ఫిక్స్ అయ్యి ఉన్న షెడ్యూల్ కారణంగా సాయంత్రం 9 గంటలకు ఫ్లైట్ ఎక్కారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన కారణంగా, అక్కడి ప్రజలు తన కోసం ఎదురుచూస్తున్న కారణంగా హుటాహుటినా సింగపూర్ కు వెళ్లాల్సి ఉన్న ఆగిపోయారు. అన్ని పనులు ముగించుకొని, కురిడి ఆలయంలో తన కొడుకు క్షేమంగా ఉండాలని పూజలు చేసి సింగపూర్ కు బయల్దేరారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా సింగపూర్ కు బయల్దేరాడు. నేరు ఆస్పత్రికి వెళ్లి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఏంటని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10న జన్మించారు. ప్రస్తుతం 8 ఏళ్ల వయస్సుకు చేరుకున్నాడు. సింగపూర్ లో విద్యనభ్యసిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X