పవన్ కళ్యాణ్ కొడుకు స్కూల్లో అగ్నిప్రమాదం.. మంటల్లో తీవ్ర గాయాలు

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురి అయ్యారు. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్లో తన స్కూలింగ్ ను పూర్తి చేసుకుంటున్నారు. కాగా తాజాగా మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ తనయుడు చిక్కుకోవడం ఆందోళనకరంగా మారింది. స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అర్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీని బాలుడు మార్క్ శంకర్కు తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది.

మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో వెంటనే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డట్టు తెలుస్తోంది. అతని చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. మంటల్లో చిక్కుకోవడంతో స్వల్పంగా స్కిన్ బర్నైనట్టు సమాచారం. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. దీంతో వెంటనే అక్కడ సిబ్బంది మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Pawan Kalyan Son Mark Shankar injured fire accident at Singapore School

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. తన తనయుడు మార్క శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం జరిగిందనే విషయం క్షణాల్లోనే తెలిసింది. అయితే వెంటనే పవన్ కళ్యాణ్ ను పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లమని స్థానిక అధికారులు, నాయకులు సూచించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకో ఒప్పుకోలేదు. పర్యటన ముగిసాకే సింగపూర్ కు వెళ్తానని చెప్పారు.

'అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని... కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటాన'ని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. ఇక మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకోనున్నారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య అన్నా లెహజ్నేవ కు పుట్టిన సంతానం. పవన్ కళ్యాణ్ కు పెద్ద కొడుకు అకిరా నందన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ తన అభిమానులను హరిహర వీరమల్లు సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తెలుగుతోపాటు భారతీయ ప్రధాన భాషల్లోనూ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఓజీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారనే వార్త క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని నెటిజన్లు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. మరోవైపు ఏపీలోని ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, సినీ పర్సనాలిటీస్ స్పందిస్తూ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10న జన్మించారు. ప్రస్తుతం 8 ఏళ్ల వయస్సుకు చేరుకున్నాడు. సింగపూర్ లో తన స్కూలింగ్ ను పూర్తి చేసుకుంటున్నాడు.

More from Filmibeat

Read more about: pawan kalyan singapore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X