వకీల్ సాబ్ కోసం డేట్ ఫిక్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి ఎన్నాళ్లవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆలస్యం అవుతున్నకొద్ది అభిమానుల్లో అంచనాల డోస్ పెరుగుతున్నాయి. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ కి సంబంధించిన ప్రతి చిన్న రూమర్ కూడా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారుతోంది అంటే బజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

ఇక చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోసం ఒక స్పెషల్ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చాతుర్మాస దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. నితిన్ పెళ్లి సమయంలో పవన్ కి సంబంధించిన ఫొటోలు కూడా చాలానే వైరల్ అయ్యాయి.

Pawan kalyan special schedule dates for vakeel saab

అయితే సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ఇప్పటికే హైదరాబాద్ లో మొదలైంది. పవన్ కళ్యాణ్ తో అవసరం లేని సీన్స్ ని కూడా పూర్తి చేస్తున్నారు. ఇక పవన్ దసరా తరువాత తన దీక్షను ముగించుకొని షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ నెల 27 నుంచి రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం పవన్ కేవలం 20రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇవ్వనున్నాడట. ఏదైనా ఆ 20రోజుల్లోనే అయిపోవాలని డబ్బింగ్ కూడా ముందుగానే పూర్తి చేసేలా ఏర్పాటు చేయాలని నిర్మాతకు ఒక వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి గుర్తింపును అందిస్తుందో చూడాలి. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే 2021 జనవరిలో సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X