శభాష్ రాంచరణ్.. మరిన్ని విజయాలు సాధించాలి.. పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం
మెగా పవర్‌స్టార్ రాంచరణ్ అమెరికాలో గత ఐదు రోజులుగా హల్‌చల్ చూస్తూ అంతర్జాతీయ మీడియాను విశేషంగా ఆకట్టుకొంటున్నాడు. యూఎస్‌లో అడుగుపెట్టిన నుంచి బిజీగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభిమానులతో సెల్పీలు, ముచ్చట్లతో హంగామా చేస్తున్నారు. హైదరాబాద్‌లో అయ్యప్ప మాలతో వెళ్లిన రాంచరణ్ అమెరికాలోని ఆలయంలో మాలను తీసిన తర్వాత గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నారు. ఏబీసీ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇలాంటి హవాను కొనసాగిస్తున్న రాంచరణ్‌ను పవన్ కల్యాణ్ అభినందించారు. చెర్రీని రాంచరణ్ ఏమని ప్రశంసించారంటే..

అమెరికాలోని బేవెర్లీ హిల్స్‌లో శనివారం (ఫిబ్రవరి 25వ తేదీన) ఉదయం రిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో రాంచరణ్ సందడి చేశారు. RRR మూవీకి వచ్చిన స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. హెచ్‌సీఏ అవార్డుల్లో RRR సినిమాకు 4 అవార్డులు రావడం తెలిసిందే. ఈ అవార్డులతో రాంచరణ్ అరుదైన ఘనత అందుకున్నారు.
ప్రతిష్టాత్మక హెచ్‌సీఏ అవార్డుల్లో ప్రజెంటర్‌గా ప్రత్యేక పాత్రను పోషించారు. బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్ క్యాటగిరిలో అవార్డును రాం చరణ్ ప్రకటించడం విశేషంగా మారింది. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ హీరోగా రాంచరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన పక్కన నిలబడటమే అవార్డు అంటూ నటి ఏంజెలా చెప్పడం వైరల్ అయింది. ఈ సందర్భంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమా పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై 'బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మెన్స్ క్యాటగిరీలో అవార్డును రాంచరణ్ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్‌కు, దర్శకులు శ్రీ రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.


Click it and Unblock the Notifications











