OG గ్లింప్స్ వివరాలు లీక్.. క్లైమాక్స్‌లో పవన్ నుంచి సాలిడ్‌గా.. తెలుగులోనే ఫస్ట్ టైం ఇలా!
సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'వకీల్ సాబ్'తో కమ్‌బ్యాక్ అయిన అతడు.. ఆ తర్వాత 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి చిత్రాలతో సందడి చేశాడు. ఇప్పుడు కూడా చేతి నిండా సినిమాలతో పవన్ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 1990 నాటి ముంబై మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో దీనిపై ఫ్యాన్స్ విపరీతంగా నమ్మకం పెట్టుకున్నారు. దాన్ని ఏ మాత్రం ఒమ్ము చేయకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ మూడు నెలల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుతూ వస్తోంది. ఇలా ఇప్పటికే 50 శాతం పైగా టాకీ పార్టును తీసేశారు. అయినప్పటికీ దీని నుంచి పోస్టర్ లాంటివి కూడా వదలలేదు. ఈ పరిస్థితుల్లో త్వరలోనే ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారు.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ గ్లింప్స్‌ను పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక, ఇందులో కోలీవుడ్ యంగ్ యాక్టర్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని కూడా రెండు రోజుల క్రితమే న్యూస్ లీకైంది. తాజాగా మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి.
ఫిలిం నగర్ సమచారం ప్రకారం.. 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ గ్లింప్స్ వీడియో 72 సెకెన్లు లేదా 1.12 నిమిషాల నిడివితో రాబోతుందట. ఇందులో పవన్ కల్యాణ్ స్టైలిష్ గెటప్‌తో కనిపిస్తాడని తెలిసింది. అంతేకాదు, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా ఉండబోతుందని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఈ గ్లింప్స్ క్లైమాక్స్‌లో పవన్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే విధంగా ఉంటుందట. మొత్తానికి ఈ వీడియో టాలీవుడ్‌లో ఎప్పుడూ చూడని అనుభూతిని ఇవ్వబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక.. 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











