Ustaad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. ఏకంగా 1000 మందితో!
గతంలో కంటే రీఎంట్రీలో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు మరో నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు.
పవర్ స్టార్ ఇప్పుడు చేస్తోన్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ మధ్యనే జరిపించారు. కానీ, సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను మాత్రం ఇటీవలే మొదలు పెట్టారు.
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను జరిపారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో చిత్ర యూనిట్ సభ్యులు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తాజాగా నిర్మాణ సంస్థ నుంచి వివరాలతో కూడిన ప్రకటన వచ్చింది.
పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌లో ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కల్యాణ్‌తో పాటు మరో వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న ఓ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారని కూడా వెల్లడించారు.
అంతేకాదు, ఇదే షెడ్యూల్‌లో చిన్న పిల్లలతో కొన్ని కామెడీ సీన్స్‌ను కూడా షూట్ చేశారని చెప్పారు. అలాగే, హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్‌తో పాటు పోలీస్ స్టేషన్ సెట్‌లో కీలకమైన సన్నివేశాలను కూడా షూట్ చేశారని తెలిపారు. ఇవన్నీ ఎంతో బాగా వచ్చాయని కూడా చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.
సక్సెస్‌ఫుల్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











