Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. పవన్ ఏమున్నాడు భయ్యా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా అతడు దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ నెంబర్ వన్ హీరోగా సత్తా చాటుతోన్నాడు. అదే సమయంలో ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుంటోన్నాడు. ఇక, రీఎంట్రీలో మరింత జోష్‌తో కనిపిస్తోన్న ఈ మెగా హీరో.. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అలాగే, ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇప్పుడు పవన్ నటిస్తోన్న చిత్రాల్లో పక్కా కమర్షియల్ జోనర్‌లో వస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి.
'గబ్బర్ సింగ్' వంటి భారీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమానే 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ఇటీవలే మొదలు పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను జరిపారు. అలాగే మిగిలిన షెడ్యూళ్లను కూడా పక్కా ప్లాన్‌తో చేసుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటోన్నారు. ఈ గ్యాప్‌లో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు చిత్ర యూనిట్ అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు రెడీ చేస్తోంది. తాజాగా ఒకదాన్ని వదిలింది.

పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను ఈరోజు (మే 11) సాయంత్రం 4.59 గంటలకు విడుదల చేయబోతున్నారు. దీనిపై గంటకో అప్‌డేట్ కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అతడు రఫ్ లుక్‌తో గ్లాసెస్ పెట్టుకుని యమ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటోన్నారు. ఇక, ఈ పోస్టర్‌పై 'ఈ సారి ఇది ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు' అని రాసి మరీ సినిమాపై అంచనాలను అమాంతం పెంచారు.

ఇదిలా ఉండగా.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి వాళ్లు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











