Ustaad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌కు ఊహించని ట్రీట్.. ఎన్నికలకు ముందే క్రేజీ వీడియో

గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తూ.. వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే పలు సినిమాలతో వచ్చి ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరించిన అతడు.. ఇప్పుడు కూడా కొన్ని మూవీలు చేస్తున్నాడు. అందులో పక్కా కమర్షియల్ జోనర్‌లో వస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. ఈ సినిమా నుంచి ఇప్పుడు అదిరిపోయే ట్రీట్ రాబోతుంది. ఇంతకీ ఏంటది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

భారీ అంచనాలతోనే
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమానే 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీనికితోడు గ్లింప్స్ విడుదల చేసి హైప్‌ను మరింతగా పెంచేశారు.

Pawan Kalyan Starrer Ustaad Bhagat Singh Glimpse Release Soon

షూట్ ఆగిపోయింది
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే మొదలు పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను జరిపారు. అలాగే మిగిలిన షెడ్యూళ్లను కూడా పక్కా ప్లాన్‌తో చేసుకుంటూ వెళ్లాలని అనుకున్నారు. కానీ, పవన్ కల్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడంతో ఇది ఆగిపోయింది.

అదిరిపోయే ట్రీట్
పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్ ప్రస్తుతం జరగడం లేదు. పవర్ స్టార్ వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతోన్న నేపథ్యంలో దీన్ని నిలిపేశారు. ఫలితంగా ఈ సినిమా మొత్తానికే ఆగిపోయిందన్న టాక్ కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్‌ను ఇవ్వాలని ప్లాన్ చేశారు.

Pawan Kalyan Starrer Ustaad Bhagat Singh Glimpse Release Soon

గ్లింప్స్ రాబోతుంది
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ యూనిట్ తాజాగా X (ట్విట్టర్) ఖాతాలో 'ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఊహించనిది రాబోతుంది' అని తెలిపింది. అలాగే, రెండు ఎమోజీలను కూడా పెట్టింది. దీంతో ఈ సినిమా నుంచి గ్లింప్స్ వస్తుందని అంతా అనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పవన్ పొలిటికల్ డైలాగ్‌తో కూడిని ఓ వీడియోను త్వరలోనే వదలబోతున్నారట. దీంతో ఈ ట్రీట్‌పై అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఎవరెవరు ఉన్నారు
ఇదిలా ఉండగా.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X