పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎన్నికల ముందే ఆ సినిమా రిలీజ్

దాదాపు రెండు మూడేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పాత సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వీటి సంఖ్య మరింతగా పెరిగిపోయింది. కొన్ని ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అలా వచ్చిన వాటికి ఆడియెన్స్ అదిరిపోయే రెస్పాన్స్‌ను ఇస్తున్నారు. దీంతో ఈ తరహాలో మరిన్ని చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను నటించిన క్రేజీ సినిమా రీ రిలీజ్‌ కాబోతుంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషీ', 'జల్సా', 'తొలి ప్రేమ' సినిమాలను రీ రిలీజ్ చేసిన అభిమానులు.. ఇప్పుడు అతడు రీఎంట్రీ ఇచ్చిన 'వకీల్ సాబ్' మూవీని కూడా మరోసారి తీసుకు వస్తున్నారు. సమ్మర్ హాలీడేస్‌తో పాటు ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోన్న నేపథ్యంలో మే 1వ తేదీన ఈ క్రేజీ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను అధికారికంగా వదిలారు.

Pawan Kalyan Starrer Vakeel Saab Movie Re Release on May 1st

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో వచ్చిన 'వకీల్ సాబ్' మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. అంతేకాదు, దీన్ని ఏకంగా 300లకు పైగా స్క్రీన్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఈ సినిమా అప్‌డేటెడ్ 4K ప్రింట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయింది. ఇక, ఈ సినిమా ట్రైలర్‌ను మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక, ఈ సినిమా విడుదలను పండుగలా జరుపుకోవాలని ఫ్యాన్స్ ఏర్పాట్లను చేస్తోన్నారు.

'వకీల్ సాబ్' మూవీ.. బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్'కు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఓ కేసులో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే లాయర్‌గా ఇందులో పవన్ కల్యాణ్ కనిపించాడు. దీన్ని తెలుగు నేటివిటీకి, పవన్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా తెరకెక్కించడంలో వేణు శ్రీరామ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక, ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ చిత్రానికి హై ఓల్టేజ్ మ్యూజిక్ అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X