twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్రతాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. ఆవుల మధ్య గోపాలుడిలా పవర్ స్టార్.. వైరల్ అవుతోన్న పిక్స్

    |

    మెగా ఫ్యామిలీలో అందరి కంటే ప్రత్యేకమైన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కేవలం సినిమాలతో వచ్చిన క్రేజే అనుకుంటే అది పొరపాటే అవుతుంది. సినిమాలో కనబడేదానికంటే రియాల్టీలో ఆయన ప్రవర్తించే విధానానికే ఎక్కువ మంది అభిమానులు అయ్యారు. సినిమాలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా అతనిని ఆరాధించే వారెంతో మంది ఉన్నారు. జనసైనికులుగా మారి ఎంతో మంది ఆయన వెనుక నడుస్తున్నారు.

    తాజాగా పవన్ కళ్యాణ్ కార్తీక మాస వ్రతాన్ని ప్రారంభించినట్లు తెలిపాడు. తన వ్యవసాయ క్షేత్రం నుంచి వన రక్షణ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. మన పురాణాలు, వేదాల్లో చెప్పినట్లు అడవుల సంరక్షణ, మొక్కలు నాటాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీంతో పాటే తన గోశాలలోని గోవుల ఫోటోలను కూడా షేర్ చేశాడు. వర్షపు చినుకుల్లో గొడుగు పట్టుకుని నవ్వులు చిందిస్తోన్న తమ జనసేనాని చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు.

    Pawan Kalyan Started Karthika Masam Vratham, Pics Goes Viral

    త్వరలోనే పవన్ కళ్యాణ్ వెండితెరపై మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించబోతోన్నారటి టాక్ వినిపిస్తోంది. అయితే గత కొంతకాలం నుంచి ఇలాంటి వార్తలు వైరల్ కావడం, వెంటనే వాటిని ఖండించడం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీపై ఎప్పుటికప్పుడు ఏవో కొత్త వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలె తమిళ్‌లో హిట్ అయిన నేర్కొండా పార్వై (హిందీ చిత్రం పింక్ రీమేక్) చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్ చేయనున్నారని, ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి.

    English summary
    Started my ‘Karthika masam vratham’ & also initiated JSP’s ‘Vana Rakshana’ program from my farm .The intention of this program is to safeguard forests and plantation of trees as said in Puranas and vedas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X