పవన్ కల్యాణ్ కోసం హైపర్ ఆది ఫ్యాన్స్ ఎంత పని చేశారంటే.. ట్రెండింగ్‌గా వీడియో
సినీ హీరోలు, నటుల ఫ్యాన్స్ అభిమానాన్ని కొలవడానికి కొలబద్దలు చాలా కష్టం. తమ అభిమానాన్ని చాటుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. నచ్చిన హీరో, హీరోయిన్లకు గుడికట్టే వార్తలు తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని హైపర్ ఆది అభిమానులు గుడికట్టడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ కామెడీ షోలో తనదైన పంచ్ డైలాగ్స్‌తో వినోదరంగంలోకి హైపర్ ఆది దూసుకొచ్చాడు. కొద్దికాలంలోనే టెలివిజన్‌లో స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. అప్పుడప్పుడూ సినీ రంగంలో అతిథి పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌కు, జనసేన పార్టీకి అండగా నిలిచాడు. సోషల్ మీడియాలోనూ, టెలివిజన్‌లోనూ బాహాటంగా చర్చల్లో పాల్గొని మద్దతు తెలిపారు.

పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీన గోదావరి జిల్లాలో ఆది అభిమానులు పవర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం ట్రెండ్ అవుతున్నది. ఈ కార్యక్రమానికి పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. రాపాక వరప్రసాద్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు భారీగా నినాదాలు చేస్తూ ఆకట్టుకొన్నారు.


Click it and Unblock the Notifications











