Bro మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్.. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో పవన్

జనసేన పార్టీ అధినేతగా ఒకవైపు రాజకీయాలను చూసుకుంటూనే.. మరోవైపు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా సత్తా చాటుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏకధాటిగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు, తన అభిమానులకు మజాను పంచుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా నాలుగైదు ప్రాజెక్టులను ఈ స్టార్ హీరో లైన్లో పెట్టుకున్నాడు. అందులో మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతున్న 'బ్రో (BRO)' మూవీ ఒకటి. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని క్రేజీగా తీస్తున్నారు.

'బ్రో (BRO)' మూవీలో పవన్ కల్యాణ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత ఫిబ్రవరిలోనే ప్రారంభం అయింది. ఆ వెంటనే వరుసగా షెడ్యూళ్లను పూర్తి చేసుకుని.. టాకీ పార్టును ఎవరు ఊరించనంత వేగంగా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా ప్రచారంపై చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు టీజర్‌ను వదలబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు.

 Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న 'బ్రో (BRO)' మూవీకి సంబంధించిన టీజర్‌ను జూన్ 29 అంటే ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి పవన్ కల్యాణ్ కొత్త పోస్టర్‌ను వదిలారు. ఇందులో అతడు బ్లాక్ కలర్ డ్రెస్‌లో అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో కనిపిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్ కాసేపట్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. దీనితో టీజర్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

మెగా హీరోల కాంబినేషన్‌లో రాబోతున్న 'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ 'వినోదయ సీతమ్'కు రీమేక్‌గా రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X