OG Pawan Kalyanకు హీరోయిన్ ఫిక్స్.. వచ్చే వారమే షూటింగ్.. ఎక్కడో తెలుసా?
తెలుగు ప్రజల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ఫ్లాప్‌లు అంటూ తేడా లేకుండా ఎలాంటి క్రేజ్ తగ్గని హీరోగా తన సత్తా చాటుతున్నాడు. ఎన్ని ఓటమిలు ఎదురైనా ఫ్యాన్స్ మాత్రం తగ్గని ఏకైక హీరో పవన్. ఇక పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించడమం అంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ అదృష్టంగానే భావిస్తారు. ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ ఆ హారోయిన్ పై అభిమానం చూపించడం మొదలుపెడతారు. అయితే తాజాగా ఓ మలయాళ బ్యూటి పవన్ కల్యాణ్ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆమె ఎవరనే వివరాల్లోకి వెళితే..
విభిన్నమైన ప్రాజెక్ట్స్:రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చాు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అయితే వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ మూవీ తర్వాత భీమ్లా నాయక్ తో అలరించారు పవన్ కల్యాణ్. ఇక ఆ సినిమా తర్వాత మరో మూవీ రాలేదు. కానీ పలు విభిన్నమైన ప్రాజెక్ట్సుతో త్వరలో ముందుకు రాబోతున్నాడు.

రెండు పార్టులుగా:ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాను పవన్ కల్యాణ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ఓ టాక్ అయితే నడుస్తోంది. ఈ సినిమానే కాకుండా పవన్ కల్యాణ్ వినోదయ సీతమ్ రీమేక్ మూవీలో, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను లైన్ లో పెట్డాడు.
పాన్ ఇండియా డైరెక్టర్:అంతేకాకుండా ఇటీవలే వకీల్ సాబ్ 2ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఆ మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలే కాకుండా పవన్ కల్యాణ్ OG అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు యుక్త వయసులోనే ప్రభాస్ తో సాహో వంటి పాన్ ఇండియా మూవీని డైరెక్ట్ చేసిన సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేయనున్నారని టాక్.

హీరోయిన్ ఫిక్స్:RRR నిర్మాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ OG మూవీకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు సినిమాటోగ్రాఫర్ తెలిపారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే టాపిక్ మొదటి నుంచి చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓజీ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు.
షూటింగ్ స్టార్ట్.. ఎక్కడంటే:పవన్-సుజిత్-దానయ్య కాంబినేషన్ లో వస్తున్న ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ సినిమాలో హీరోయిన్ గా మలయాళ క్యూట్ బ్యూటి ప్రియాంక అరుళ్ మోహన్ ను ఓకే చేశారు. అందుకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా పవన్ కల్యాణ్, ప్రియాంక ఇద్దరూ వచ్చే వారం చిత్రీకరణలో పాల్గొననున్నారట. ఈ షూటింగ్ ముంబైలో జరగనుందని సమాచారం.

నాని సినిమాలో:ఇలా వరుసగా సినిమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు పవన్ కల్యాణ్ కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్ ఇదివరకు నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే శివ కార్తికేయన్ వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ వంటి చిత్రాలతో కూడా సుపరిచితమే. సూర్య నటించిన ఎవరికీ తలవంచకు మూవీలో కూడా ఆకట్టుకుందు బ్యూటిఫుల్ ప్రియాంక అరుళ్ మోహన్.


Click it and Unblock the Notifications











