OG Release Date : పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ డేట్.. ఈ సీక్రెట్ తెలుసా?

పవర్ స్టార్ అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ అందుతూనే ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైన సంగతి తెలిసిందే. 2023లో 'బ్రో' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన నెక్ట్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లు పొలిటికల్ జర్నీలో బిజీగా ఉన్న సంగతి విధితమే. జనసేన పార్టీతో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో కాస్తా సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ లైనప్ లోని సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. తాజాగా ఓజీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.

ఓజీ మూవీ బడ్జెట్, వివరాలు..
ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహింస్తుండగా ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముంబై, హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రొగ్రామ్స్ కారణంగా తాడేపల్లిలో ప్రత్యేక సెట్స్ లో జరుగుతోంది. అక్కడ మరిన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.

Pawan Kalyan Sujeeth Upcoming film OG Release Date Locked

ఓజీ రిలీజ్ డేట్ సీక్రెట్ ఇదే..
పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషణ్ లోని They Call him : OG సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 25 సెప్టెంబర్ 2025న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే విజయదశమిని దృష్టిలో ఉంచుకొని సినిమా విడుదల తేదీని లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 8 రోజుల పాటు బాక్సాఫీస్ కలెక్షన్లకు ఆటంకం లేకుండా ఉండేలా రిలీజ్ డేట్ ను ఫైన్ చేశారని తెలుస్తోంది. దీంతో మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలో పయనించబోతుందని తెలుస్తోంది.

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్..
అయితే, ఓజీ మూవీ రిలీజ్ డేట్ కు 8 రోజులు కలిసి వస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 25న రిలీజ్ డే, సెప్టెంబర్ 26, 27, 28 వీకెండ్, సెప్టెంబర్ 30న హాలీడే, అక్టోబర్ 1న ఆయుధ పూజా, అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు విజయ దశమి, అక్టోబర్ 3న తెలంగాణలో సెలవు కావడంతో ఓజీ బాక్సాఫీస్ వసూళ్లకు మంచి ముహూర్తంగా భావించారు. ఇంత మంచి ఛాన్స్ ఇటీవల ఏ సినిమాకు రాలేదనే చెప్పాలి. మరోవైపు జూన్ 12న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను యూనిట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఓజీ మూవీ స్టోరీ లైన్ ఇదే..
ఓజీ చిత్రంలో పవన్ కళ్యణ్ కనికరంలేని డాన్ ఓజాస్ గంభీరాగా కనిపించబోతున్నారు. 10 ఏళ్లు అజ్ఘాతంలో ఉండి తిరిగి ముంబైకి వచ్చిన తర్వాత మరో డాన్ ఓమీ బాహును చంపేస్తాడని, మిగితా క్రిమినల్స్ ను కూడా హతమారుస్తాడనేది స్టోరీ లైన్. అయితే ఆ పదేళ్లు ఏం జరిగింది, ఓమీ బాహుతో గొడవ ఏంటీ? అనేది అసలు కథ. ఇక ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మూడు కాలాలలో కనిపిస్తారంట. 30 ఏళ్ల యువకుడిగా చూపించేందుకు ఓజీ టీమ్ De - Aging technology ని వినియోగిస్తున్నారని ప్రచారం.

More from Filmibeat

Read more about: pawan kalyan sujeeth og movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X