ప్రధాని మాట పాటిద్దాం.. పవన్ కళ్యాణ్ సందేశం వైరల్

కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆదివారం (మార్చి 22) ప్రజలెవరూ బయటకు రాకుండా ఎవరికి వారు స్వీయ నిర్భందాన్ని విధించుకోవడమే జనతా కర్ఫ్యూ. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌పై విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. అందరికీ ఈ విధానం గురించి వివరించడని, ఆ రోజు ఎవ్వరూ కూడా బయటకు వెళ్లొద్దని, తెలిసిన వారందరికీ చెప్పండని ప్రధాని సూచించారు.

ఈ మేరకు జనతా కర్ఫ్యూ గురించి బాలీవుడ్ ప్రముఖులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, అమితాబ్, షాహిద్ కపూర్ వంటి హీరోలు వీడియో సందేశం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం ముందడుగు వేశాడు. ప్రధాని నిర్ణయానికి తన మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించి సందేశాన్ని పంపాడు.

 Pawan Kalyan Support Janta CurFew

ప్రధాని మాట పాటిద్దాం-కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం అంటూ స్లోగన్‌ను ప్రచారం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రధాని చెప్పినట్టుగా ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు ఎవ్వరూ బయటకు రాకూడదని సూచించాడు. ఇలా చేస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేసే అవకాశముందని తెలిపాడు. కాబట్టి ప్రజలంతా ప్రధాని సూచనలను పాటించాలని పిలుపునిచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X