పవన్ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్.. పవన్ కి కరోనా నెగెటివ్.. కానీ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే లాంటి ఒక వార్త బయటకు వచ్చింది. గత మూడు రోజులుగా కరోనా తో బాధ పడుతున్న పవన్ కళ్యాణ్ కి తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ అంశం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రిలో సిటీ స్కాన్ చేయించుకుంటే అందులో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనకు యాంటీ వైరల్ డ్రగ్స్ కూడా అందించారు. అలానే ఆక్సిజన్ కూడా అవసరం కావడంతో అది పెట్టించి తరువాత డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత పవన్ తన ఫాం హౌస్ కి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన ఫాంహౌస్ లో నే ఐసోలేషన్ లో ఉంటున్నారు.

వర్థమాన తార నైనిషా బ్యూటిఫుల్ గ్యాలరీ..

 అభిమానులకి మాట ఇచ్చినట్టుగానే

అభిమానులకి మాట ఇచ్చినట్టుగానే

ఇక అప్పుడు చేసిన పరీక్షల్లో ఆయనకు జ్వరంతో పాటు ఊపిరితిత్తులలో నిమ్ము చేరిందని డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆయనకు యాంటీ వైరల్ డ్రగ్స్ తో పాటు ఆక్సిజన్ కూడా అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోని ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు తల్లడిల్లిపోయారు. ఇక తర్వాత కాస్త కోలుకున్నాక పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక ఆయన అభిమానులకు మాట ఇచ్చినట్టుగానే ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ట్రినిటీ హాస్పిటల్ లో మళ్లీ సిటీ స్కాన్ చేయించుకోగా ఆయనకు కరోనా నెగిటివ్ అని తేలినట్లు సమాచారం.

 అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్

అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్

ఈ మేరకు మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. దీని మీద పవన్ కళ్యాణ్ ప్రతినిధులు కానీ జనసేన ప్రతినిధులు కానీ స్పందించాల్సి ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ కు కరోనా వచ్చిన సంగతి కూడా జనసేన అధికారికంగా ప్రకటించిన తర్వాత జనానికి తెలిసింది. ఇక ఈ అంశం మీద కూడా మరికాసేపట్లో జనసేన వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కు కరోనా నెగిటివ్ అని తేలిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలనుకునే వారిని భగవంతుడు ఎల్లప్పుడూ చల్లగా చూస్తాడు అని అందుకే తమ పవన్ కళ్యాణ్ ఇంత త్వరగా కోలుకున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.

 పెద్ద ఎత్తున పూజలు

పెద్ద ఎత్తున పూజలు

నిజానికి పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ అని తేలినప్పటి నుంచి అభిమానులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు ఆయన త్వరలో కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల పూజలు కూడా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కు కరోనా సోకిన విషయం తెలుసుకుని చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలని

పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలని

పవన్ అభిమానుల పూజలు ఫలించాయో లేక పవన్ శ్రేయోభిలాషుల ఆకాంక్షలు ఫలించాయో తెలియదు కానీ ఆయనకు త్వరగా నెగిటివ్ రావడం జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళ సినిమా అయ్యప్పనుం కోషియుం రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా పవన్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క రాజకీయాల్లో కూడా పవన్ యాక్టివ్ గా ఉంటున్నారు. రాబోతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సైతం జనసేనను పోటీలోకి దించాలని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X