షాకింగ్ న్యూస్: పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. రామ్ చరణ్ అలెర్ట్.. నిమిషాల్లో చేరుకున్న అపోలో బృందం

జనసేన అధినేత స్టార్ హీరో పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారికంగా ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.. కొద్ది రోజుల నుంచి హోం ఐసోలేషన్ లో ఉన్న పవన్ ఇటీవల టెస్టులు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా లేఖ ద్వారా తెలియజేసింది.

Recommended Video

Pawan Kalyan కి Covid పాజిటివ్, ఊపిరితిత్తుల్లో నిమ్ము, పూర్తి వివరాలు !!
హోమ్ క్వారంటైన్ లోకి..

హోమ్ క్వారంటైన్ లోకి..

గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు చాలానే వైరల్ అవుతున్నాయి. అనేక రకాల రూమర్స్ వైరల్ అవ్వడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. అయితే మొదట నెగిటివ్ రాగా మరుసటి టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. అయితే అంతకుముందే హోం ఐసోలేషన్ లో ఉన్న పవన్ ఇప్పుడు పూర్తిగా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.

అలెర్ట్ అయిన మెగాస్టార్

అలెర్ట్ అయిన మెగాస్టార్

ఈ నెల 3న తిరుపతి పాదయాత్ర బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం కొంత అస్వస్థతకు గురయ్యారు. ఇక రెండవసారి పరీక్షల్లో పాజిటివ్ అని రాగానే మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖ అలాగే ఇతర మెగా కుటుంబ సభ్యులు అలెర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

రామ్ చరణ్ కూడా..

రామ్ చరణ్ కూడా..

ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడం వలన వైద్యులు యాంటీవైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. ఇక హీరో రామ్ చరణ్ కూడా వెంటనే స్పందించి అపోలో వైద్య బృందం పవన్ ఇంటికి చేరేలా భార్య ఉపాసనతో మాట్లాడారు. ఉపాసన కూడా వెంటనే వైద్యులను అలెర్ట్ చేసినట్లు జనసేన పార్టీ తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు కూడా వివరణ ఇచ్చినట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X