పవన్ కళ్యాణ్ OG నుంచి ఈ సింబల్ 火.. దీని అర్థం ఏంటో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాల గురించి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ నుంచి వరుసగా అప్డేట్స్ అందుతున్నాయి. పెండింగ్ లో ఉన్న చిత్రాలు చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నారు. త్వరలో హరి హర వీరమల్లు చిత్రం విడుదల కాబోతుండగా.. తాజాగా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ OG నుంచి ఇంట్రెస్టింగ్ వార్తను అందించారు మేకర్స్. దాంతో పాటు వారు వదిలిన ఓ సింబల్ ఇప్పుడు నెట్టింట హార్ట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్లితే..
ఓజీ చిత్రం ఇంట్రెస్టింగ్ విషయాలు..
ప్రేక్షకులలో ఓజీ చిత్రంపై అంతకంతకు ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. సాహో చిత్రంతో బ్లాక్ బాస్టర్ ను అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుడం భారీ అంచనాలను నెలకొల్పింది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ. 250 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించారు. ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తుండటం విశేషం. అర్జున్ దాస్ వంటి నటులు విలన్ పాత్ర పోషించడం ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఓజీ పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి..
తాజాగా ఓజీ షూటింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఇప్పటికే మూవీ షూటింగ్ హైదరాబాద్, ముంబై, ఏపీలో జరిగింది. ఇక రీసెంట్ గా ఏపీలోని తాడేపల్లిలో ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు చేసి షూటింగ్ జరిపారు. అయితే తాజాగా ఓజీ షూటింగ్ పైనా మేకర్స్ అప్డేట్ అందించారు. పవన్ కళ్యాణ్ నటిస్తూ 'ఓజాస్ గంభీర' షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని తెలిపారు. ఇక మిగలిన షూటింగ్ వివరాలను కూడా వెన్వెంటనే అందబోతున్నాయని చెప్పారు.
ఈ సింబల్ 火కి అర్థం ఏంటీ..?
పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో పాటు చైనీస్ భాషలో కోట్స్ పెడుతూ ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతున్నారు. ఇక తాజాగా '火' ఈ చైనీస్ సింబల్ తో ఆసక్తిని పెంచారు. ఇంతకీ దాని అర్థం ఏంటనీ చాలా మంది చూస్తున్నారు. 火 చైనీస్ భాషలో దీని అర్థం 'ఫైర్'. తెలుగులో 'మండే నిప్పు' అని అర్థం. పవన్ కళ్యాణ్ క్రేజ్, రేంజ్ కు తగ్గట్టుగానే పోస్టర్ పై కోట్ పెట్టడం మరింత హైప్ ను పెంచుతోంది. ఇక మున్ముందు ఈ చిత్రం నుంచి ఎలా అప్డేట్స్ రాబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఓజీ మూవీ రిలీజ్ డేట్...
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి హరి హర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత ఓజీ మూవీ విడుదల కాబోతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ ను పూర్తి చేయడంతో నెక్ట్స్ మిగితా ఆర్టిస్టులతో సీన్లు షూట్ చేయనున్నారు. మే1 నుంచి 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ నిర్విరామంగా ఓజీ షూటింగ్ లో పాల్గొన్నారు. రోజు 15 గంటల పాటు పని చేసి దర్శకుడికి సహకరించడం విశేషం. ఇక ఈ చిత్రం 2025, సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందు రానుంది.


Click it and Unblock the Notifications











