Tholi Prema: రీ రిలీజ్‌లో పవన్ మరో రికార్డు.. తొలిసారి అలాంటి ఈవెంట్ కూడా!

కొంత కాలంగా తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్‌ల సందడి జోరందుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న వారితో పాటు మరికొందరు సీనియర్, జూనియర్ హీరోలు నటించిన చాలా చిత్రాల మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను అందుకున్నాయి.

అంతేకాదు, ఇలా వచ్చిన చిత్రాలు కూడా కలెక్షన్ల వర్షం కురిపించి ఎన్నో అదిరిపోయే రికార్డులను సైతం క్రియేట్ చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను బడా హీరోగా మార్చేసిన సినిమా కూడా రీ రిలీజ్‌ కాబోతుంది.

Pawan Kalyan Tholi Prema Movie Re Release on June 30th

పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషీ', 'జల్సా' సినిమాలను రీ రిలీజ్ చేసిన అభిమానులు.. ఇప్పుడు అతడిని స్టార్‌గా మార్చేసిన 'తొలిప్రేమ' మూవీని కూడా మరోసారి తీసుకు వస్తున్నారు. ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తవబోతున్న నేపథ్యంలో జూన్ 30వ తేదీని రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను అధికారికంగా వదిలారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - కరుణాకరణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'తొలి ప్రేమ' మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. అంతేకాదు, దీన్ని ఏకంగా 300లకు పైగా స్క్రీన్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఈ సినిమా 4K ప్రింట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయింది. ఇక, ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 24వ తేదీన ఉదయం 10:30 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.

దీనికోసం ఓ స్పెషల్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. తద్వారా రీ రిలీజ్ సినిమాకు ట్రైలర్ ఈవెంట్‌ను చేసిన ఘనతను పవన్ ఫ్యాన్స్ అందుకోబోతున్నారు.ఇది పూర్తైన వెంటనే ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఇక, పవన్‌ను స్టార్‌గా మార్చిన ఈ సినిమా విడుదలను పండుగలా జరుపుకోవాలని ఫ్యాన్స్ ఏర్పాట్లను చేస్తోన్నారు.

ఇక.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'తొలిప్రేమ' సినిమా 1998లో రిలీజ్ అయింది. కరుణాకరణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగు అమ్మాయి కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని అందించారు. వాసుకి, అలీ, వేణు మాధవ్, రవి బాబు వంటి వాళ్లు కీలక పాత్రలు చేశారు. అప్పట్లో ఈ చిత్రం లవ్ స్టోరీ మూవీలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అంతేకాదు, పవన్ కల్యాణ్ క్రేజ్‌ను, మార్కెట్‌ను కూడా పెంచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X