పవన్ కల్యాణ్ తొలిప్రేమ రీ రిలీజ్.. 4k ట్రైలర్ కట్ అదిరిందిగా!

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. సందర్భాన్ని బట్టి ఆ హీరో సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. మహేశ్ పోకిరితో మొదలైన ఈ ట్రెండు.. కొనసాగుతూ వస్తోంది. గతేడాది పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి సినిమాలు రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన సినిమా తొలిప్రేమ. ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం 4K ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా: 1998 జులై 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే కరెక్టుగా నేటికి ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగానే ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి 4కె ట్రైలర్ ను విడుదల చేయగా.. దానికి విశేష స్పందన వస్తోంది. ట్రైలర్ లో పాటలు, డ్యాన్స్ లు, డైలాగులు.. క్లీన్ గా కట్ చేశారు. ఇక పవన్ ను వింటేజ్ లుక్ లో చూసి ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.

Pawan Kalyan Tholi Prema Re Release 4K Trailer Release

బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం: ఇక ఈ సినిమా విషయానికి వస్తే... లవ్ స్టోరీస్ స్పెషలిస్టు కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి రెడ్డి నటించింది. ఇక ఈ సినిమాలో వాసుకి, వేణుమాధవ్, అలీ, నగేశ్, అచ్యుత్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఈ సినిమా పలు అవార్డ్స్ కూడా గెలుచుకుంది.

జూన్ 30న రీ రిలీజ్: ఇక ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లు అవుతున్నా సినిమాపై యూత్ లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ 4K టెక్నాలజీతో ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. తొలిప్రేమ విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాను జూన్ 30 రీరిలీజ్ చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ సినిమాను భారీగా విడుదల చేసేలా ప్లాన్స్ చేస్తున్నారు. సుమారు 300కు పైగా థియేటర్స్ లో తొలిప్రేమ మూవీ 4k వెర్షన్ తో రీ రిలీజ్ కానుంది.

పవన్ ఫ్యాన్స్ ఖుషి: ఇక ఈ సినిమాలో సిన్సియర్ లవర్ గా పవన్ కళ్యాణ్ మెప్పించాడు. ఆయన యాక్టింగ్, మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దేవా సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అప్పట్లో మ్యూజిక్ లవర్స్ ని ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ ఈ పాటలు యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న తొలిప్రేమ ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ అయింది. ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X