For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్‌కి పవన్ కళ్యాణ్ సందేశం.. వెంటనే రియాక్ట్ అయిన బన్నీ.. ఇష్యూ హాట్ టాపిక్

    |

    అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'అల.. వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా సూపర్‌ సక్సెస్ సాధించింది. తొలి రోజే 85 కోట్ల గ్రాస్‌ వసూళు చేసి సంక్రాంతి విన్నర్ అయింది. దీంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్బంగా అల్లు అర్జున్‌కి పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్ చెబుతూ సందేశమిచ్చారు. వివరాల్లోకి పోతే..

    'అల.. వైకుంఠపురములో' సక్సెస్.. సెలబ్రిటీ విషెస్

    'అల.. వైకుంఠపురములో' సక్సెస్.. సెలబ్రిటీ విషెస్

    అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో హాట్రిక్ మూవీగా వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సక్సెస్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన విషెస్ తెలుపుతూ ''కంగ్రాట్స్ బావా'' అనేశాడు.

    పవన్ కళ్యాణ్ సందేశం.. అలా సంబోధిస్తూ

    పవన్ కళ్యాణ్ సందేశం.. అలా సంబోధిస్తూ

    ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్‌కి అభినందనలు తెలుపుతూ పూలబొకేతో సందేశం ఇచ్చారు. స్వయంగా లెటర్ రాసిన పవన్.. బన్నీని గౌరవనీయులైన అల్లు అర్జున్‌ గారు అని సంబోధించడం హాట్ టాపిక్ అయింది.

    బన్నీకి పవన్ విషెస్.. ఆల్ ది బెస్ట్

    బన్నీకి పవన్ విషెస్.. ఆల్ ది బెస్ట్

    ''గౌరవనీయులైన అల్లు అర్జున్ గారూ.. 'అల.. వైకుంఠపురములో' ఘన విజయం సాధించిన సందర్భంగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. భవిష్యత్‌లో మీ ప్రాజెక్ట్స్ మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్'' అని పేర్కొంటూ బన్నీకి పవన్ విషెస్ చెప్పారు. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్.

    రియాక్ట్ అయిన బన్నీ.. ఏమన్నారంటే

    రియాక్ట్ అయిన బన్నీ.. ఏమన్నారంటే

    పవన్ పంపిన ఈ సందేశంపై రియాక్ట్ అయిన బన్నీ.. `పవన్‌ కళ్యాణ్‌ గారి నుంచి శుభాకాంక్షలు రావటం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్యూ వెరీ మచ్‌ పవన్‌ కళ్యాణ్‌ గారు` అంటూ ట్వీట్ పెట్టారు. దీంతో ఈ మామాఅల్లుళ్ళ మధ్య జరిగిన ఈ సంభాషణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఈ సంభాషణపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

    Ala Vaikunthapurramuloo Genuine Public Talk

    'అల.. వైకుంఠపురములో' మూవీ

    గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో 'అల.. వైకుంఠపురములో' మూవీ రూపొందింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.

    English summary
    Allu Arjun, Trivikram Srinivas hatric movie Ala vaikunthapurramuloo. Now Pawan Kalyan tweet on Ala vaikunthapurramuloo success. Allu Arjun reacted on that.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X