Bro టీజర్ తోనే బీభత్సం.. మరో రికార్డ్ అందుకున్నారుగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సముద్రఖని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా జీ స్టూడియోస్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న బ్రో సినిమాపై అంచనాలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. జూలై 28వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.
ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ద్వారానే ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు టీజర్ ద్వారా కూడా రోజు రోజుకు మరిన్ని రికార్డులను అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలయిక కావడంతోనే ఈ సినిమాకు కావలసినంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వచ్చాయి. ఇక మరోవైపు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండడంతో మార్కెట్లో ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే పెరిగింది.

తప్పకుండా బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తుంది అని టీజర్ రెస్పాన్స్ తోనే మరోసారి అర్థమయింది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ సినిమాను ఐదు లక్షల లైక్స్ వచ్చాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా 30 మిలియన్ల వ్యూవ్స్ అందుకొని అత్యధిక స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న టాప్ టీజర్స్ లో ఒకటిగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో బ్రో అనే డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక అతని మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మార్క్(మార్కండేయుడు) అనే పాత్రలో కనిపించబోతున్నాడు. టీజర్ లో కాలానికి సంబంధించిన ఒక డిఫరెంట్ షాడోని హైలెట్ చేసి చూపించారు. తప్పకుండా సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పకనే చెప్పేసారు. ఇక ఈ సినిమా లో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తుండగా తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, రాజా, రోహిణి అలాగే మరి కొంతమంది నటులు ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











