పవన్ కళ్యాణ్ వెంకటేష్ మధ్య బాక్సాఫీస్ ఫైట్.. ఆ రెండు సినిమాలు వచ్చేది అప్పుడే?
రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ తరుణంలో ఫెస్టివల్ సీజన్స్ లో అయితే కొంతమంది హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీ కూడా జరగబోతోంది. నెక్స్ట్ దసరా ఫెస్టివల్ నుంచి వచ్చే సంక్రాంతి వరకు కూడా ప్రముఖ హీరోల సినిమాలు ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అందులో అన్ని అనుకున్న సమయానికి అయితే రాలేవు. కొన్ని రిలీజ్ డేట్స్ విషయంలో అయితే మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది.
అయితే ఊహించిన విధంగా మరో ఇద్దరికి హీరోల మధ్య కూడా ఆసక్తికరమైన పోరు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. వారు మరెవరో కాదు మంచి సోదర భావంతో మెలిగే వెంకటేష్ పవన్ కళ్యాణ్ మధ్యలో బాక్సాఫీస్ క్లాష్ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన కొన్ని పోస్టర్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.
ఇక ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా హాలిడేస్ టార్గెట్ చేసి విడుదల చేయాలి అని ముందుగానే డిసైడ్ అయ్యారు. అయితే అదే సమయానికి పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఒక సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ లో OG అనే సినిమాను ఫినిష్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50% పూర్తయింది.
యువ దర్శకుడు సుజిత్ తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమా కంప్లీట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను కూడా క్రిస్మస్ హాలిడేస్ ను టార్గెట్ చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. సైంధవ్ విడుదలవుతున్న రోజే అదే డేట్ ను అనుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు క్లాష్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు కొనసాగే అవకాశం ఉంది. మరి ఈ క్లాష్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











