ఓజీ కోసం కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న సుజిత్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీలైనంత వేగంగా ఓజీలో తనకి సంబందించిన సీక్వెన్స్ అన్ని కంప్లీట్ చేయాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. అందుకే గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో తాను కనిపించే సన్నివేశాలు అన్ని షూట్ చేసేస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ప్రతినాయకుడిగా ఎవరు నటిస్తున్నారు అనేదానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కాని ఇతర క్యాస్టింగ్ కి సంబందించిన నటీనటులని పరిచయం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఖైది, మాస్టర్, చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్త టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ ని ఎంపిక చేయడం జరిగిందంట.

ప్రస్తుతం అర్జున్ దాస్ ఇళయదళపతి విజయ్ లియో మూవీలో కూడా విలన్ గ్యాంగ్ లో ఒకడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ టాలెంటెడ్ యాక్టర్ బుట్టబొమ్మ సినిమాతో టాలీవుడ్ లోకి ఆగుపెట్టాడు. ఇప్పడు పవన్ కళ్యాణ్ ఓజీలో కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ లో కూడా ఈ కుర్ర నటుడు బిజీ కావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న ఓజీ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో పాల్గొనాల్సి ఉంది. జూన్ 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరగనుంది. ఇది పూర్తయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











