OG కోసం ప్రముఖ హీరోను దించుతున్న సుజిత్.. నెవ్వర్ బిఫోర్ అనేలా పవర్ఫుల్ రోల్స్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్య ఎన్నో సినిమాల్లో నటిస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు ఒకేసారి నాలుగు సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ప్రస్తుతం ఈ మెగా హీరో చేస్తున్న మూవీల్లో 'OG' ఒకటి. సాహో ఫేం సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయని తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తోన్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ రూపొందిస్తోన్న 'OG' మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ను ఇటీవలే ముంబై నగరంలో మొదలు పెట్టారు. అంతేకాదు, ఆ వెంటనే అక్కడ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఆ వెంటనే మరో దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇలా వీలు దొరికినప్పుడల్లా దీన్ని చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలతో పని చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

Pawan kalyan upcoming movie OG special role update

'OG' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో విలన్‌గా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో ప్రతినాయకుడిగా నటించబోతున్నాడని తెలిసింది. అతడు ఎవరో ఇంకా తెలియదు కానీ.. ఈ సినిమాలో మాత్రం ఎంతో పవర్‌ఫుల్‌ రోల్‌ను చేస్తున్నాడని న్యూస్ లీకైంది. త్వరలో ముంబైలో జరగనున్న మరో షెడ్యూల్‌లో ఆ హీరో.. పవన్ కల్యాణ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'OG' మూవీలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో మంది స్టార్లు కీలక పాత్రలను చేస్తున్నారు. ఇక, ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X