Pawan Kalyan ఉస్తాద్ భగత్ సింగ్ న్యూ ప్లాన్ రెడీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ కమర్షియల్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అసలైతే గత ఏడాది వీరి కాంబినేషన్లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా మొదలు కావాలి. కానీ అనుకోకుండా సినిమా స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కు నచ్చకపోవడంతో క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో మరో మంచి సినిమా చేయాలని హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
ఇక మొత్తానికి తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న తెరి కథను తెలుగులో రీమేక్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. మొదటి షెడ్యూల్ ను మార్చి చివరి వారంలో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను ఇదే ఏడాది నవంబర్ వరకు పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

ఇక డిసెంబర్లో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేసి జనవరిలో సంక్రాంతికి సినిమాను గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు తెలుస్తోంది. తెరి సినిమా కథను దర్శకుడు హరిష్ శంకర్ పూర్తి స్థాయిలో మార్చేసినట్లు సమాచారం. అంతే కాకుండా డిఫరెంట్ స్టైల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ఈ స్క్రిప్ట్ తెరపైకి రాబోతున్నట్లు సమాచారం. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో మరో తమిళ కథను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న వినోదాయ సితంపై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ కథకు త్రివిక్రమ్ మాటలు రచన సాకారం అందించబోతున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు లేదా ఆ తరువాత గాని రిలీజ్ కావచ్చని సమాచారం. అలాగే పవన్ హరిహర వీరమల్లు, OG సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











