For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ రఫ్ఫాడించే టైమ్ వచ్చింది... వరుసగా ఆరు అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు!

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో సరికొత్త సందడి మొదలైంది. ఒకరి తరువాత మరొకరు వారి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా భవిష్యత్తు సినిమాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే మహేష్ బాబు తన పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాటతో ఏ విధంగా హడావుడి చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రభాస్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అలాంటి అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికిసరికొత్త కాంబినేషన్స్ పై అయితే రూమర్స్ బాగానే వస్తున్నాయి కానీ అందులో ఏది ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలియదు.

   వరుసగా అప్డేట్స్

  వరుసగా అప్డేట్స్

  అయితే నెక్స్ట్ ప్రభాస్ కాస్త ఆలస్యంగా అప్డేట్స్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాత్రం అప్పుడే సందడి మొదలైంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా వరుసగా అప్డేట్స్ రాబోతున్నాయి.
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త సినిమాలను లైన్ లో పెట్టాడు. రాజకీయాల కంటే ముందు వరకు కూడా పవర్ స్టార్ ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ వచ్చాడు. ఇక సినిమాలకు ఆల్ మోస్ట్ గుడ్ బై చెప్పినట్లు అభిమానులు కంగారు పడుతున్న సమయంలో మళ్లీ వెండితెరపైకి అదే స్టామినాతో వచ్చాడు.

   ఎంతో ఆతృతగా..

  ఎంతో ఆతృతగా..

  మొత్తానికి వకీల్ సాబ్ సినిమాతో తన బాక్సాఫీస్ రేంజ్ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ అభిమానులు నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నారు ఒక విధంగా త్రివిక్రమ్ ఆ సినిమాకు దర్శకత్వం పర్యవేక్షకుడిగా కూడా ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.

   ముహూర్తం ఫిక్స్

  ముహూర్తం ఫిక్స్


  ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్ తో సమానంగా మరొక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన అసలు టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఆగస్టు 15న ఉదయం 10 గంటల 45 నిమిషాలకు మూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.
  సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అని అందరికీ తెలిసిందే. ఆరోజు పవర్ స్టార్ అభిమానులు పుట్టినరోజు సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నారు.

  వరసగా ఆరు స్పెషల్ అప్డేట్స్

  వరసగా ఆరు స్పెషల్ అప్డేట్స్

  తప్పకుండా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయని గట్టి నమ్మకంతో కూడా ఉన్నారు. ఇక అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ నుంచి మొదలుపెడితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వరకు వరసగా ఆరు స్పెషల్ అప్డేట్స్ రాబోతున్నట్లు సమాచారం. ఆ రీమేక్ సినిమా టైటిల్ గా 'భీమ్లా నాయక్' పోస్టర్ ను రెడీ చేసినట్లు సమాచారం. సినిమా ఫస్ట్ లుక్ తో పాటు మొదటి పాటను కూడా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

  మేకింగ్ వీడియోను కూడా

  మేకింగ్ వీడియోను కూడా

  మరోవైపు పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. హరిహర వీరమల్లు అనే టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమా పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయవచ్చని టాక్ అయితే వస్తోంది.

  Vihari tweets about Pspk rana movie | Filmibeat Telugu
  మరో రెండు అప్డేట్స్ ఏంటి?

  మరో రెండు అప్డేట్స్ ఏంటి?

  ఈ నాలుగు రకాల అప్డేట్స్ తో పాటు మరొక రెండు అప్డేట్స్ ఏమిటనేవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే కానీ ఆ సినిమా పై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కేవలం ఒక కమిట్మెంట్ మాత్రమే తీసుకున్నారు. కానీ పూర్తి కథ ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అయితే అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పూర్తయ్యే సరికి ఏడాది సమయం పడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే రెండేళ్లు ఆగాల్సిందే. అలాగే గబ్బర్ సింగ్ నిర్మాత కూడా ఓ సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఆ ప్రాజెక్టు పై ఏదైనా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.

  English summary
  Tollywood power star Pawan kalyan upcoming movies back to back updates soon,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X