Bhagath's Blaze గ్లాస్ అంటే సైజు కాదు.. కనిపించని సైన్యం.. పొలిటికల్​ హీట్ పెంచేలా పవన్ కల్యాణ్ కౌంటర్

ఉస్తాద్ భగత్ సింగ్​ ఓ రేంజ్​లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్​ కల్యాణ్ నటించడమే. షూటింగ్​ తాత్కాలికంగా ఆగిపోయినా సినిమాకు సంబంధించిన ఇతర పనులు మాత్రం స్లో స్లోగా సాగుతూ ముందుకు వెళ్తోంది. అయితే గత రెండు ముండు రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం సాగుతున్న సంగతి తెలిసింది. ఇప్పుడా సర్​ప్రైజ్ అప్డేట్ బయటకు బ్లాస్ట్​ అయిపోయింది. పవన్ పొలిటికల్ కౌంటర్​ డైలాగ్స్​తో ఆద్యంతం ఈ ప్రచార చిత్రం ఫ్యాన్స్​లో పూనకాలు తెప్పించేలా ఉంది. దీని గురించి పూర్తి కథనం స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...

ఉస్తాద్.. ఉస్తాద్​.. ఉస్తాద్​.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఇప్పుడీ పేరే వినిపిస్తోంది. పవర్ స్టార్ నటిస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. షూటింగ్ అప్పుడెప్పుడో మొదలైన ఎన్నో ఒడుదొడుకులతో సాగుతూ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిపోయింది. అందుకు కారణం పవన్ కల్యాణ్​. ఆయన ఇప్పుడు రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు అంటూ కెరీర్​లో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Blaze Released and Teaser Review Here

అయితే ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫీవర్ ఎక్కువైపోయింది. ఎందుకంటే మరో రెండు నెల్లలో ఎన్నికలు రానున్నాయి. దీంతో పవన్​ గ్యాప్ లేకుండా అధికారమే లక్ష్యంగా ప్రచార సభలు అంటూ శ్రమిస్తున్నారు. ఈ కారణంగా డేట్స్ ఇవ్వలేక ఉస్తాద్​ షూటింగ్​ సాఫీగా సాగలేదు. దీంతో పవన్ కోసమే ఏళ్ల పాటు కాయలు కాసేలా ఎదురుచూసిన ఈ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్​.. మాస్ మహారాజా రవితేజను హీరోగా పెట్టి మరో సినిమాను తెరకెక్కించడం మొదలుపెట్టారు. దీంతో ఉస్తాద్ ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ హరీశ్ వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. సినిమాను స్లోగా అయినా సరే బ్యాలెన్స్​ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు.

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Blaze Released and Teaser Review Here

అలా రీసెంట్​గా ఎన్నికల సభల్లో బిజీగా తిరుగుతున్న పవన్​ కల్యాణ్​ పట్టుకుని తీసుకొచ్చి మరీ కాస్త డబ్బింగ్ చెప్పించారు. ఫ్యాన్స్​లో ఆనందం నింపడం కోసం నిర్మాణ సంస్థతో కలిసి సర్​ప్రైజ్ టీజర్​ను రెడీ చేశారు. పవన్ డైలాగ్​తో ఉన్న ప్రచార చిత్రాన్ని తాజాగా విడుదల చేసి సోషల్ మీడియాను బ్లాస్ట్ చేశారు. గాజు పగిలేకొద్ది పదును ఎక్కిది. కచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం. కనిపించని సైన్యం. అంటూ పవన్ పవర్ ఫుల్ డైలాగ్స్​ వేశారు. ముందుగా ఊహించినట్టే పవన్ పొలిటికల్​ డైలాగ్స్​తో కౌంటర్లు వేశారు. పొలిటికల్​ హీట్ పెంచేలా కౌంటర్లు వేస్తూ సంభాషణలు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న ఎన్నికల వాతావరణంలో పవన్​ రాజకీయ ప్రయాణానికీ, సినిమా ప్రచారానికీ ఉపయోగపడేలా ఈ డైలాగ్స్​ను ఉపయోగించినట్లు స్పష్టమవుతోంది. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​, యాక్షన్ సీన్స్ బాగున్నాయి.

ఇకపోతే ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. పవన్ కోసమే ప్రత్యేకంగా కొన్ని శక్తిమంతమైన సంభాషణలను రాశారట. చూడాలి మరి ఈ సినిమా థియేటర్లలో ఆడియెన్స్​ను ఎలా మెప్పిస్తుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X